మహిళలను ఇబ్బంది పెట్టే పని చేశా.. బాగా ఫీల్ అవుతున్నా.. స్టార్ హీరో సంచలన కామెంట్స్
Recommended Video
నేటి సమాజంలో మహిళలే కీలకం. రోజు రోజుకూ ఎదుగుతున్న మహిళా శక్తి దేశ ప్రగతికి చిహ్నం. అలాంటి మహిళల పట్ల తాను చేసిన పనికి తెగ ఫీల్ అయిపోతున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. తమిళనాట ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ యువ హీరో కెరీర్ ఆరంభంలో చేసిన పొరపాట్లను తలచుకొని బాధపడుతున్నాడు. వివరాల్లోకి పోతే..

అజిత్ ఫార్ములానే వేరు
దక్షిణాది తారల్లో కెల్లా హీరో అజిత్ ఫార్ములానే వేరు. ఆయన సినిమాలన్నీ డిఫరెంట్ జోనర్ లో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటాయి. అయినప్పటికీ ఆయనకు మహిళా ఫయాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ ఫాలోయింగ్ కి ప్రధాన కారణం ఆయనకు సమాజం పట్ల ఉన్న అభిమానమే.

'పింక్' సినిమా తమిళ రీమేక్
బాలీవుడ్ లో భారీ సక్సెస్ సాధించిన పింక్ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'నెర్కొండ పార్వై' అనే టైటిల్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సమాజంలో మహిళా ప్రాధాన్యం తెలిపేలా ఈ సినిమా కథాంశం ఉంటుంది. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కెరీర్ ఆరంభంలో పొరపాటు చేశా
ఈ టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ పై అజిత్ రియాక్ట్ అవుతూ మహిళల పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. తన కెరీర్ ఆరంభంలో మహిళలను ఇబ్బందిపెట్టే తరహాలో సాగే కొన్ని పాత్రలు చేసి పొరపాటు చేశానని అజిత్ పేర్కొన్నాడు. అలాంటి పాత్రలను చేసినందుకు ఇప్పుడు తాను చాలా బాధపడుతున్నట్లుగా వెల్లడించారు అజిత్.

తప్పును సరిదిద్దుకుని
అయితే కెరీర్ స్టార్టింగ్ లో చేసిన ఆ తప్పును సరిదిద్దుకుని ఇప్పుడు నెర్కొండ పార్వై అనే మహిళా ప్రాధాన్యత గల సినిమాలో నటించడం ఆనందంగా ఉందని ఈ సందర్బంగా ఆయన చెప్పారు. దీంతో ఇంత బాహాటంగా తన పొరపాటుని ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్న అజిత్ వ్యక్తిత్వం పట్ల పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు జనం.


Click it and Unblock the Notifications











