విడుదలకు ముందే లీక్ అయిన స్టార్ హీరో సినిమా
తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు అజిత్ కుమార్. స్టైలిష్ లుక్, విలక్షణమైన నటనతో అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, ఈ మధ్య అతడు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడడం లేదు. దీంతో అజిత్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.
వరుస పరాజయాల తర్వాత అజిత్ నటించిన చిత్రం 'నెర్కొండ పార్వాయి'. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ - తాప్సీ పన్ను కలయికలో వచ్చిన చిత్రం 'పింక్'కు ఇది రీమేక్‌గా వస్తోంది. దీన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించారు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటచలం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా తమిళ నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నెర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్ భార్యగా విద్యా బాలన్ నటిస్తుంది. ఈమెకి ఈ చిత్రం తమిళంలో తొలి మూవీ . గిబ్రాన్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా గురువారం (ఆగస్టు 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'నెర్కొండ పార్వాయి' విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. కొందరు ఈ సినిమా మొత్తాన్ని లీక్ చేశారు. అయితే, అది ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే, ఇటీవల సింగపూర్‌లో ఈ సినిమా స్పెషల్ షో వేశారు. అక్కడ ఎవరైనా దీన్ని రహస్యంగా షూట్ చేసి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. చిత్ర యూనిట్ దీనిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయడంతో, ఆ డౌన్‌లోడ్ లింక్స్ తీసేశారని తెలిసింది.


Click it and Unblock the Notifications











