Valimai first glimpse : హాలీవుడ్ రేంజ్ యాక్షన్.. పదే నిముషాల్లో రికార్డులు బద్దలు..దటీజ్ అజిత్!
చాలా కాలం పాటు వరుస ఫ్లాపులను చవి చూసి.. 'నెర్కొండ పార్వాయి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. ఈ విజయం ఇచ్చిన జోష్‌తోనే ఆ వెంటనే 'వలిమై' అనే సినిమాను ప్రారంభించాడు. దీన్ని కూడా హెచ్ వినోథ్ తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఒక గ్లింప్స్ ఇచ్చారు సినిమా యూనిట్. ఆ వివరాల్లోకి వెళితే

ముందే ప్రకటించి మరీ
హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన వలిమై సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది మరియు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా నుంచి ఒక వీడియో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

అరగంట లేటుగా
గ్లింప్స్ ఆఫ్ 'వలిమై' సెప్టెంబర్ 23 న సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయబడుతుందని చెప్పారు. సాయంత్రం 6 గంటల నుండి అందరూ ట్విట్టర్‌లో టైమ్‌లైన్‌ను రిఫ్రెష్ చేస్తున్నారు. కానీ గ్లింప్స్ ప్రకటించిన సమయంలో రాలేదు. ఇది చూసి వారు బోనీ కపూర్జీ వలిమై గ్లింప్స్ ఎక్కడ అని ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు. అయితే అరగంట తరువాత గ్లింప్స్ ఆఫ్ స్ట్రెంత్ విడుదల చేయబడింది. అయితే ఆ గ్లింప్స్ చూసిన తరువాత అరగంట వేచి ఉన్న విషయం కూడా అందరూ మర్చిపోయారు.

తమిళ్ హిస్టరీలోనే మొదటిసారి
ఇక ఒక తమిళ చిత్రం కోసం గ్లింప్స్ విడుదల కావడం ఇదే మొదటిసారి. అందుకే అజిత్ ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్ అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ముందుగా దీపావళికి 'వలిమై' చిత్రం విడుదల అవుతుందని భావించారు. కానీ ఇప్పటికే రజనీకాంత్ అన్నత్తే దీపావళికి విడుదల చేస్తున్నట్టు ధృవీకరించారు. దీంతో దానితో పోటీ పడడం ఎందుకని వెనక్కు తగ్గారు.

హాలీవుడ్ కు ఎక్కడా తగ్గకుండా
ఇక విడుదలైన వీడియోలో అజిత్ యాక్షన్ బైక్ ఛేజింగ్ సన్నివేశాలు, హాలీవుడ్ మూవీకి సమాంతరంగా ఉన్న యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అలాగే అజిత్ డైలాగ్ 'ఆట ప్రారంభిద్దాం, చాలా ఆలస్యం అయ్యింది, సోదరా' అనే అంశాలు సినిమాపై అంచనాలను పెంచాయి. మరియు ఈ వీడియోలో, 'మీరు సేవించిన విషం మేమే, మేము సాతానుకు బానిసలం, మన ప్రపంచం డార్క్ వెబ్, దానిలో ఏదైనా అతిక్రమిస్తే? అనే డైలాగులు సైతం వైరల్ అవుతున్నాయి.

హిస్టరీ క్రియేట్ చేసిన వలిమై
ఇక అజిత్ పేరు మీద కేవలం పది నిమిషాల్లోనే హిస్టరీ క్రియేట్ చేశారు ఆయన అభిమానులు. నిజానికి ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అజిత్ అభిమానులు రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'వలిమై' గ్లింప్స్ అయితే ఏకంగా పది నిమిషాల్లోనే 100కే లైక్స్ కొల్లగొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా సినిమా కోసం విడుదల అయిన ఒక గ్లిమ్ప్ కి కు 10 నిమిషాలలో ఇన్ని భారీ లైక్స్ రావడం విశేషమని చెప్పాలి.
Recommended Video
సోషల్ మీడియాలో వైరల్
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీని గురించి హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌తో సహా సోషల్ మీడియా సైట్లలో వైరల్ అవుతోంది. 'వలిమై' చిత్రాన్ని వచ్చే సంక్రాంతి రోజున విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అజిత్, హ్యూమా ఖురేషి, కార్తికేయ, సుమిత్ర, యోగిబాబు, పుకల్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి యువశంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ వలిమై సినిమాని విజయ్ వేలుకుట్టితో కలిసి బోనీకపూర్ మరియు జీ స్టూడియో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











