Don't Miss!
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అజిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: అదిరిపోయే అప్డేట్కు ముహూర్తం ఖరారు
దాదాపు మూడు దశాబ్ధాలుగా దక్షిణాదిలోనే పేరున్న హీరోగా వెలుగొందుతున్నాడు థలా అజిత్ కుమార్. విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అతడు.. సుదీర్ఘ కాలంగా తెలుగు తమిళ రాష్ట్రాల్లో మార్కెట్‌ను పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవలి కాలంలో వరుస పరాజయాలను ఎదుర్కొంటోన్న ఆయన.. 'పింక్' రీమేక్‌గా వచ్చిన 'నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'వాలిమై' అనే సినిమా చేస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ నుంచి అప్డేట్ రెడీ అవుతోంది.
'నెర్కొండ పార్వాయి' వంటి భారీ హిట్ తర్వాత.. ఆ చిత్ర దర్శకుడు హెచ్ వినోద్‌తో కలిసి చేస్తున్న చిత్రమే 'వాలిమై'. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఇందులో అజిత్ కుమార్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి మధ్య వయస్కుడి పాత్ర కాగా, మరొకటి బైక్ రేసర్ రోల్ అని అంటున్నారు. ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా.. తెలుగు యంగ్ హీరో 'RX100' ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ చేస్తున్నారు.
దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. దీని కోసం అజిత్ కుమార్ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఆ మధ్య ప్రమాదానికి కూడా గురయ్యాడు. అయినప్పటికీ దాని నుంచి కోలుకున్న వెంటనే మూవీ షూట్ ప్రారంభించాడు. ఇక, ఈ మూవీ గురించి అప్డేట్స్ పెద్దగా రాకపోవడంతో థలా ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 'వాలిమై' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. తాజా సమాచారం ప్రకారం.. దీన్ని మార్చిలో రిలీజ్ చేయబోతున్నారట.