Valimai Trailer: ఫ్యాన్స్‌కు అజిత్ అదిరే గిఫ్ట్.. అదిరిపోయిన 'వాలిమై' ట్రైలర్.. మరో హిట్ పక్కా?

చాలా కాలం పాటు వరుస ఫ్లాపులు అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ 'నెర్కొండ పార్వాయి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ విజయం ఇచ్చిన జోష్‌తోనే ఆ వెంటనే 'వాలిమై' అనే సినిమా ప్రారంభించాడు. దీన్ని కూడా నెర్కొండ పార్వాయి తెరకెక్కించిన హెచ్ వినోథ్ తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

జనవరి 13న

జనవరి 13న

హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన వలిమై సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తి కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.

వాలిమై ట్రైలర్ రిలీజ్

వాలిమై ట్రైలర్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కి వాలిమై లో టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అజిత్ ప్రకటించిన దగ్గర నుంచి తమిళ అభిమానులు మాత్రమే కాదు ఇతర భాషలలోని అజిత్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక తాజాగా సినిమా యూనిట్ వాలిమై ట్రైలర్ రిలీజ్ చేసింది.

ఆద్యంతం ఆసక్తికరంగా

ఆద్యంతం ఆసక్తికరంగా

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఫ్రేమ్ అజిత్ అభిమానులకు ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా అజిత్, కార్తికేయ సహా మిగతా వాళ్ళు సైతం బైక్ స్టంట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇక యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత ప్లస్ అయింది. బాలీవుడ్ బ్యూటీ హుమా కురేషి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోండగా బోణీ కపూర్, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

బైక్ ఛేజింగ్

బైక్ ఛేజింగ్

ఇక ఇక విడుదలైన వీడియోలో అజిత్ యాక్షన్ బైక్ ఛేజింగ్ సన్నివేశాలు, హాలీవుడ్ మూవీకి సమాంతరంగా ఉన్న యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అలాగే అజిత్ డైలాగ్స్, కార్తికేయ ఎలివేషన్ సైతం సినిమా మీద ఆసక్తిని పెంచిందని చెప్పాలి.ట్రైలర్ లో అన్ని డైలాగులు వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Street Light Movie Trailer Launch By Senior Actor Vinod Kumar
వాలిమై సినిమా మాత్రమే

వాలిమై సినిమా మాత్రమే

ఈ సినిమాలో అజిత్, హ్యూమా ఖురేషి, కార్తికేయ, సుమిత్ర, యోగిబాబు, పుకల్, తదితరులు నటించగా యువ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ వలిమై సినిమాని విజయ్ వేలుకుట్టితో కలిసి బోనీకపూర్ మరియు జీ స్టూడియో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు నుంచి ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలు ఉండగా తమిళ్ నుంచి ఈ ఒక్క వాలిమై సినిమా మాత్రమే రంగంలోకి దిగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X