నిర్మాతగా మారుతున్న మరో టాప్ హీరో
తాజాగా అవే రూమర్లు మళ్లీ బలంగా వినిపిస్తున్నాయి. ఈ సారి సొంతంగా అజిత్ నిర్మాణ సంస్థను లాంచ్ చేయబోతున్నారని, తొలి చిత్రంలో తనే హీరోగా నటించబోతున్నాడని, ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. పా రంజిత్ ఇటీవల అజిత్ ను సంప్రదించి స్టోరీ, స్ర్కిప్టు వివరించాడని, అతను చెప్పిన స్టోరీ తనకు ప్లస్సయ్యే విధంగా ఉండటంతో పాటు, సొంతంగా ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టడానికి తక్కువ ఖర్చులో సినిమా పూర్తయ్యేలా ఉందని, ఇదే అదునుగా అజిత్ 'గుడ్ విల్ ఎంటర్ టైన్మెంట్స్' సంస్థను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే...ఒకప్పటి అందాల తార శ్రీదేవి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న 'ఇంగ్లిష్ వింగ్లిష్" చిత్రం ద్వారా ఆమె మళ్లీ రంగుల సినీ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం రాని ఓ గృహిణి పాత్రలో నటిస్తున్నారు శ్రీదేవి. ఈ చిత్రంలో తమిళ నటుడు, బిల్లా మూవీ హీరో అజిత్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే అతనిపై కొన్ని సీన్లు చిత్రీకరించారు. శ్రీదేవికి వీరాభిమాని అయిన అజిత్ ఆ చిత్ర దర్శకులు అడగ్గానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఒకే చెప్పాడు. ఈచిత్రం సెప్టెంబర్ నెలాఖరున విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












