ద్విపాత్రాభినయంతో మురుగదాస్ నెక్స్ట్ చిత్రం
కథ నచ్చి వెంటనే అంగీకరించడంతో మురుగదాస్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇందులో అజిత్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు సమాచారం. ఇదివరకు ఆయన రెండుపాత్రల్లో కనిపించినవి చక్కటి వసూళ్లు రాబట్టాయి. వాటిలో 'వాలి', 'విల్లన్', 'వరలారు' వంటివి ఉన్నాయి. ఆ జాబితాలో ఇది కూడా చేరుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరో ప్రక్క కార్తీతో 'సిరుత్త్తె' లాంటి భారీ ప్రాజెక్టు రూపొందించిన శివ దర్శకత్వంలో అజిత్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా, మాస్ ప్రేక్షకులను అలరించేదిగా ఉంటుందని చెప్తున్నారు. శివ తెలుగులో రీసెంట్ గా దరువు చిత్రం చేసారు. తాప్సీ, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. యమలోకం నేపధ్యంలో రూపొందిన ఆ చిత్రం సోషియో ఫాంటసీ అయినా ప్రేక్షకులకు ఆ మేరకు వినోదం పంచలేకపోయింది. అరవ వాసన ఎక్కువైందని విమర్శులు రావటం కూడా సినిమాకు మైనస్ గా మారింది. దాంతో శివ తన మకాంని తమిళంకు మార్చారు.
అజిత్ ప్రస్తుతం వరుసపెట్టి చిత్రాలు చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లోనే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఎలాంటి వెన్నుదన్ను లేకుండా వెండితెరపైకి వచ్చి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎవరి కోసమూ తన వ్యక్తిత్వాన్ని వదులుకోని అజిత్ తనకెంతో ఇష్టమైన బైక్‌రేస్‌లకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ కారణంగా ఒకదశలో ఆయన సినిమాల మధ్య చాలా విరామమే వచ్చింది. అయితే అభిమానులు, నిర్మాతలను దృష్టిలోకి తీసుకుని తన పంథా మార్చుకున్నాడు. పూర్తిగా వెండితెరకే అంకితమైపోయాడు.


Click it and Unblock the Notifications












