Valimai: భీమ్లా నాయక్, గనికి పోటీగా వాలిమై.. డేరింగ్ స్టెప్ వేస్తున్న అజిత్
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. దక్షిణాది మొత్తం మెచ్చే స్టార్‌గా ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు బడా హీరో అజిత్ కుమార్. విలక్షణమైన నటన.. విభిన్నమైన చిత్రాలతో కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను అందుకున్న అతడు.. తక్కువ సమయంలోనే గొప్ప నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. అదే సమయంలో స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకున్నాడు. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ మన్ననలు పొందుతూ ఎంతో మంది అభిమానాన్ని అందుకున్నాడు. ఇలా దాదాపు మూడు దశాబ్దాలుగా హవాను చూపిస్తున్నాడు. దీంతో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.
ఆ మధ్య చాలా కాలం పాటు వరుస ఫ్లాపులను చవి చూసిన కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్.. హిందీ చిత్రం పింక్‌కు రీమేక్‌గా వచ్చిన 'నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ విజయం ఇచ్చిన జోష్‌తోనే ఆ వెంటనే 'వాలిమై' అనే సినిమాను ప్రారంభించాడు. దీన్ని కూడా హెచ్ వినోథ్ తెరకెక్కించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అయినా.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన టాక్ పార్ట్ కొద్ది రోజుల క్రితమే పూర్తైంది. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా పూర్తి చేశారు.
స్టార్ హీరో అజిత్ కుమార్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే అతడు నటించిన అన్ని సినిమాలనూ మన దగ్గర కూడా విడుదల చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు చేస్తున్న 'వాలిమై' సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి దీన్ని ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడం, హిందీలోనూ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. శర్వానంద్ - రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు', కిరణ్ అబ్బవరం నటించిన 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రాలు ఫిబ్రవరి 25న విడుదల కాబోతున్నాయి. అలాగే, వరుణ్ తేజ్ నటించిన 'గని' కూడా అదే రోజున వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు అత్యంత ముఖ్యమైన పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి నటించిన 'భీమ్లా నాయక్' మూవీ కూడా ఆరోజునే విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాలకు ఒక్కరోజు ముందుగానే అజిత్ కుమార్ 'వాలిమై' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుండడంతో పోటీ ఎంతో ఆసక్తికరంగా మారింది.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వాలిమై' మూవీలో అజిత్ కుమార్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి బైక్ రేసర్ పాత్ర అని కూడా అంటున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇందులో తెలుగు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించాడు. ఇందులో హుమా ఖురేషి కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోల వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.


Click it and Unblock the Notifications











