అజిత్ కుమార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న ‘వాలిమై’
చాలా కాలం పాటు వరుస ఫ్లాపులను చవి చూసి.. 'నెర్కొండ పార్వాయి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్. ఈ విజయం ఇచ్చిన జోష్‌తోనే ఆ వెంటనే 'వాలిమై' అనే సినిమాను ప్రారంభించాడు. దీన్ని కూడా హెచ్ వినోథ్ తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోన్నా.. టాకీ పార్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. అలాగే, దీని నుంచి ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా విడుదలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.
'వాలిమై' సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ట్విట్టర్‌లో సైతం ట్రెండ్ అవుతోంది. కానీ, అది తరచూ వాయిదా పడుతోంది. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ కుమార్ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌కు డేట్ ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. 'వాలిమై' మూవీ ఫస్ట్ జూలై 15న విడుదల కాబోతుందట. అందులోనే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో తలా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఎంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వాలిమై' మూవీలో అజిత్ కుమార్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి బైక్ రేసర్ పాత్ర అని కూడా అంటున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇందులో తెలుగు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











