బుక్ మై షోలో ‘వాలిమై’ భారీ రికార్డు: ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకముందే ఇలా
తమిళ సినీ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు తలా అజిత్ కుమార్. విలక్షణమైన నటన, అద్భుతమైన మేకోవర్‌తో ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఆయన.. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. నిన్న మొన్నటి వరకూ వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ స్టార్ హీరో.. 'నెర్కొండ పార్వాయి'తో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం హెచ్ వినోథ్‌తో 'వాలిమై' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ఊహించని విధంగా ఓ అరుదైన రికార్డును దక్కించుకుంది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'వాలిమై' సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీని నుంచి కనీసం ఒక్క స్టిల్ కూడా విడుదలవలేదు. అయినప్పటికీ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ బుక్ మై షోలో ఈ సినిమా ఏకంగా ఒక మిలియన్ ఇంట్రెస్ట్‌లను (ఆసక్తి) అందుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తమిళ చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. దీనిబట్టి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ రేంజ్‌లో ఆసక్తి ఉందో అర్థం అవుతోంది. తెలుగులో పలు చిత్రాలు ఇప్పటికే ఈ మార్క్‌ను సొంతం చేసుకున్నాయి. తమిళంలో మాత్రం ఇదే ఫస్ట్ మూవీగా నిలిచింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'వాలిమై'ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ పూర్తైంది. ఇక, ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్ది రోజుల్లో రాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాలో అజిత్ కుమార్ బైక్ రేసర్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా.. తెలుగు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











