అజిత్ ‘వాలిమై’ రిలీజ్ డేట్ ఫిక్స్: ఆ పండుగ రోజే రాబోతున్న కోలీవుడ్ స్టార్
చాలా కాలం పాటు హిట్ దొరకక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ పింక్ మూవీకి రీమేక్‌గా వచ్చిన 'నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దీంతో ఈ చిత్ర దర్శకుడు హెచ్ వినోథ్‌కు మరో అవకాశం కూడా ఇచ్చాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రమే 'వాలిమై'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసిందట చిత్ర యూనిట్.
'వాలిమై' సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లు కావొస్తుంది. అయినప్పటికీ ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అంతేకాదు, దీని నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం బయటకు రాలేదు. దీంతో అజిత్ కుమార్ అభిమానులు నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు మాత్రం ఈ సినిమా విడుదల తేదీనే ఫిక్స్ చేసేశారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. 'వాలిమై' చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారట. ఈ ఏడాది ఈ పండుగ గురువారం వచ్చింది. దీంతో లాంగ్ వీకెండ్ ఉంది. అందుకే ఆ రోజును ఫిక్స్ చేశారని తెలిసింది.

ఇక, ఇప్పటికే 'వాలిమై' సినిమా హక్కులు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా రాకముందే ఈ సినిమా అన్నీ ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో అజిత్ బైక్ రేసర్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా.. తెలుగు యువ హీరో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











