Vidaamuyarchi : అజిత్ మూవీ కోసం తెగబడ్డ ఫ్యాన్స్.. సర్వర్ క్రాష్

భారతదేశంలో సినీతారలను దైవంలా ఆరాధిస్తారు అభిమానులు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూడాల్సిందే. టికెట్ ఎంతైనా సరే, ఎంత కష్టపడి అయినా సంపాదించాల్సిందే. టికెట్ దొరక్కపోతే ఏదో కోల్పోయినంతగా అభిమానులు బాధపడతారు. నార్త్‌లో ఏమో కానీ.. సౌత్‌లో మాత్రం ఇలాంటి వీరాభిమానులు అడుగడుగునా కనిపిస్తారు. నటీనటులకు ఆలయాలు కట్టి పూజించిన సందర్భాలు ఎన్నో.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడిగా కంటే ఓ వ్యక్తిగా ఆయనను అభిమానులు, సినీ ప్రముఖులు ఇష్టపడుతారు. తమిళనాడు వ్యాప్తంగా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. మొన్నామధ్య అజిత్ సినిమా చూడటానికి డబ్బులివ్వలేదని ఏకంగా కన్నతండ్రినే చంపోయాడో యువకుడు. అప్పట్లో ఈ వ్యవహారం కలకలం రేపింది.

Ajith Kumar s VidaaMuyarchi Bookings suspended at Bengaluru s Victory cinemas due to Server crash

అజిత్ లేటెస్ట్ మూవీ విదాముయార్చి విడుదలకు సిద్ధమైంది. తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో అజిత్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా అర్జున్ , రెజినా, రమ్య సుబ్రహ్మణ్యం, నిఖిల్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

తమిళనాట అజిత్ సినిమా విడుదల అంటే పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ బ్యానర్లు, రక్తదానం, అన్నదానాలతో సందడి చేస్తారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో తాజాగా విడాముయార్చి అడ్వాన్స్‌ బుకింగ్‌ను మేకర్స్ ఓపెన్ చేశారు. బుకింగ్ గురించి ఎలాంటి హడావుడి , ముందస్తు సమాచారం లేకపోవడం.. సడెన్‌గా బుక్ మై షోలో విడాముయార్చి బుకింగ్స్‌ ఓపెన్ కావడంతో అజిత్ అభిమానులు పోటెత్తారు.

అలా ఈ విషయం బయటికి పొక్కడంతో అజిత్ ఫ్యాన్స్ టికెట్స్ కోసం ఎగబడ్డారు. గంటకు 15 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్‌తో బుక్ మై షోలో తుఫాన్ కొనసాగుతోంది. ఒక్క ఇండియాలోనే అడ్వాన్స్ సేల్స్‌లో అదిరిపోయే కలెక్షన్స్ వచ్చినట్లుగా మేకర్స్ తెలిపారు. మరోవైపు విడాముయార్చి టికెట్స్ కోసం అభిమానులు ఎగబడటంతో బెంగళూరులోని ప్రఖ్యాత విక్టరీ సినిమాస్ బుకింగ్ సైట్ తట్టుకోలేకపోయింది. ఏకంగా సర్వర్ క్రాష్ కావడంతో .. బుకింగ్స్ రద్దు చేస్తున్నామని, క్షమించాలని విక్టరీ సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే అజిత్ అభిమానుల హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Ajith Kumar s VidaaMuyarchi Bookings suspended at Bengaluru s Victory cinemas due to Server crash

విడాముయార్చి టికెట్ బుకింగ్ చేసుకున్నట్లుగా అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో విడాముయార్చి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. పరిస్ధితి ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ తర్వాత అజిత్ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: ajith kumar vidaamuyarchi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X