'దరువు'కో దండం అని చేతులెత్తేసాడు
రవితేజ తాజా చిత్రం 'దరువు'. మొన్న శుక్రవారం రిలీజైన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ చిత్రం తమిళంలో రీమేక్ చేద్దామనుకున్న హీరో అజిత్ ఆశలుపై నీళ్లు జల్లినట్లైంది. దరువు దర్సకుడు శివ దర్శకత్వంలో విజయ బ్యానర్ పై ఈ చిత్రం రీమేక్ చేద్దామని ప్లాన్ చేసారు. వరసగా స్టైలిష్ మాఫియా సినిమాలు చేస్తున్న అజిత్ ఈ పాత్ర తనకు డిఫెరెంట్ గా ఉంటుందని భావించి కథ విని ఓకే చేసాడు. అయితే తెలుగులో ఈ చిత్రం రిజల్ట్ విని నమస్కారం పెట్టినట్లు తెలుస్తోంది.
గతంలో రవితేజ 'విక్రమార్కుడు'ని తమిళంలో కార్తీ హీరోగా 'సిరుత్తై' అని శివ రీమేక్ చేశారు. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా మాస్ సినిమాలు బాగా డీల్ చేస్తాడనే పేరుని శివకు తెచ్చిపెట్టింది. దాంతో దరువు చిత్రంపై అజిత్ దృష్టి పెట్టాడు. తెలుగులో 'దరువు' చిత్రం బాగా ఆడితే అదే దర్శకుడితో తాను హీరోగా దానిని తమిళంలో రీమేక్ చేయాలని అజిత్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం మీడియాకు దర్శకుడు శివ సైతం చెప్పారు. అయితే ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటంతో ఆయన విరమించుకున్నట్లు తమిళ మీడియా చెప్తోంది.
ఇక ఈ చిత్రంపై హీరోయిన్ తాప్సీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకు తగినట్లే రెచ్చిపోయి మరీ చేసేసింది. అయితే సినిమా రిజల్ట్ చూసి ఆమె కూడా డీలా పడిపోయింది. వరసగా కెరీర్ ప్రారంభం నుంచి ఫెయిల్యూర్స్ చూస్తున్న ఆమె ఈ చిత్రంతో తనకు బ్రేక్ వస్తుందని భావించింది. రవితేజ సైతం తన వరస ఫెయిల్యూర్స్ కి ఈ చిత్రంతో ఫుల్ స్టాప్ పెట్టవచ్చని మరింత ఎనర్జీతో చేసాడు. అయితే చిత్రం కథ,కథనం లోపాలు,తమిళ వాసనలు కొట్టడంతో సినిమా వర్కవుట్ కాలేదు.


Click it and Unblock the Notifications











