For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యానర్లు, పోస్టర్లు వద్దని ఫ్యాన్స్ కు స్టార్ హీరో పిలుపు

    By Srikanya
    |
    చెన్నై : తన పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు, పోస్టర్లతో డబ్బులు వృథా చేయొద్దని నటుడు అజిత్‌ కోరారు. మే ఒకటోతేదీన ఆయన 42వ పుట్టినరోజు. అభిమానులందరూ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించొద్దని అభిమానులను కోరుతున్నాడు అజిత్‌.

    ఈ విషయమై ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. ఆడంబరాన్ని నేనెప్పుడూ కోరుకోలేదు. ఇష్టపడను కూడా. అభిమానులు తమను తాము అభివృద్ధి పరుచుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించాలే తప్ప నాకోసం వృథా చేయడం సమంజసం కాదు. అందుకే అభిమానుల సంఘాన్ని రద్దు చేశాను.

    రాబోయే పుట్టినరోజు నాడు నేను చెన్నైలో ఉండను. ఏఎం రత్నం నిర్మాణంలో విష్ణువర్ధన్‌ దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తుంటా. రాజస్థాన్‌లో షూటింగ్ ఉంటుంది. అక్కడ మా కుటుంబీకులతో సాదాసీదాగా జన్మదినాన్ని జరుపుకుంటా. కటౌట్లు, బ్యానర్లు వంటివాటికి అభిమానులు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. నా అభిప్రాయాన్ని అర్థం చేసుకుని ఆ డబ్బులను పేద విద్యార్థుల చదువులకు, పేదల అవసరాలకు వినియోగించాలని కోరుకుంటున్నా. ఇలాంటివాటిని నా అసలైన పుట్టినరోజు కార్యక్రమాలుగా భావిస్తానని పేర్కొన్నారు అన్నారు.

    అలాగే అజిత్‌ కొత్తచిత్రం పేరు ఖరారవలేదని దర్శకుడు విష్ణువర్ధన్‌ తెలిపాడు. 'బిల్లా' అనంతరం వారిద్దరి కలయికలో ఓ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అజిత్‌కు జంటగా నయనతార నటిస్తుండగా, ఆర్య-తాప్సీ మరో జంటగా కనిపించనున్నారు. ప్రారంభం నుంచి పేరుపై స్పష్టత రాలేదు. ఎన్నో పేర్లు పరిశీలించినా చిత్రబృందం సంతృప్తి చెందలేకపోయింది. ఈ నేపథ్యంలో 'వలై' అన్న పేరు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. వాటిని విష్ణువర్ధన్‌, అజిత్‌ ఖండించకపోవటంతో వాస్తవమేననుకున్నారు. సినిమా టైటిల్‌ 'వలై' కాదంటూ విష్ణువర్ధన్‌ తాజాగా వెల్లడించారు. ఇంకా పేరు నిర్ణయించలేదని, కొన్నింటిని పరిశీలిస్తున్నామన్నారు. వచ్చేనెల 10న ప్రేక్షకుల చెంతకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

    English summary
    
 Ajith Kumar has appealed to his fans not to waste their hard-earned money by putting up posters, banners and cut-outs on the eve of his 42nd birthday which falls on 1st May. Ajith populary known as Thala among his fans turns 42 on May Day. In a statement, Ajith has said, “I hereby appeal to all my fans, well-wishers and friends not to waste money by putting up digital banners, cut-outs and posters on the eve of my 43rd birthday falling on 1st May this year. Instead of wasting money on these things, I’d be extremely glad if the money is spent in helping the poor and the needy,” Ajith has said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X