అజిత్ కూడా పాన్ ఇండియా అంటున్నాడు.. శ్రీదేవి భర్తతో న్యూ ప్లాన్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. కానీ ఎవరికి వారు ఒక సపరేట్ మార్కెట్ ని అలాగే వారికంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నారు. ఇక అలాంటి హీరోల్లో అజిత్ ఒకరు. అజిత్ సినిమాలు గత కొంత కాలంగా కోలీవుడ్ లో 100కోట్లకు పైగానే బిజినెస్ చేస్తున్నాయి. తమిళ్ లో దాదాపు స్టార్ హీరోలందరు కూడా తెలుగులో ఎంతో కొంత మార్కెట్ డెవలప్ చేసుకున్నారు.

విజయ్ సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలుగులో డబ్బింగ్ అవుతున్నాయి. కానీ అజిత్ ఒక్కడే ఇంకా తెలుగులో కుదురుకోవడం లేదు. అయితే ఇంకా తమిళ్ లో రజినీకాంత్ తరువాత ఎవరు కూడా పాన్ ఇండియా సినిమాలు వదలడం లేదు. రజినీకాంత్ సినిమాలు అన్ని ప్రధాన ఇండస్ట్రీలలో రిలీజ్ అవుతుంటాయి. ఇక నెక్స్ట్ అజిత్ కూడా అదే తరహాలో తన సినిమాను ఇటు సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. అందుకు శ్రీదేవి భర్త బోణి కపూర్ తో కలిసి ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు.

Ajith pan india plans for his upcoming projects

బోణి కపూర్ నిర్మాతగా H.వినోథ్ దర్శకత్వంలో అజిత్ ఒక యాక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో అజిత్ ఒక కార్ రెజర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేశారు. కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఈపాటికె సినిమా రిలీజ్ అయ్యి ఉండేది. అయితే సినిమా థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత ఆ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

తెలుగులో అప్పుడప్పుడు జనాలను ఆకర్షించిన అజిత్ హిందీ సైడ్ ఎక్కువగా ప్రయత్నాలు చేసింది లేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడ నెక్స్ట్ సినిమాతో సరికొత్త ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అందుకోసం ప్రమోషన్స్ డోస్ పెంచాలని బోణి కపూర్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అజిత్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X