పవన్ పాత్రకు తమిళంలో అజిత్ ఖరారు

By Srikanya

తెలుగులో పవన్ కళ్యాణ్ తో పంజా వంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు విష్ణు వర్ధన్. ఆయన తన తదుపరి చిత్రాన్ని తమిళంలో అజిత్ తో ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసారి పంజా ని మళ్లీ రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సుభా అనే రచయితతో స్క్రిప్టు పై కసరత్తులు చేస్తున్నట్లు చెప్పుతున్నారు. తెలుగులో మైనస్ గా నిలిచిన అంశాలు మార్చి ఈ చిత్రాన్ని రీరైట్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

ఇక గతంలో అజిత్, విష్ణు వర్ధన్ కాంబినేషన్ లో బిల్లా చిత్రం వచ్చి సంచలనం క్రియేట్ చేసింది. దాంతో వీరి కాంబినేషన్ పై అక్కడ మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అజిత్ బిల్లా- 2 చేస్తున్నారు. నిజానికి బిల్లా చిత్రానికి దర్శకత్వం వహించిన విష్ణువర్దన్‌నే బిల్లా -2 కు పని చేయాల్సింది. ఆయన తెలుగు చిత్రం పంజాను ఒప్పుకోవడంతో బిల్లా- 2కు చక్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విడుదలకు సిద్దమైంది. డేవిడ్ బిళ్లా టైటిల్ తో ఈ చిత్రం తెలుగులో విడుదల అవుతోంది.

అజిత్,విష్ణువర్దన్‌ల కాంబినేషన్‌ విషయాన్ని అజిత్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బిల్లా తర్వాత అజిత్‌తో మరో చిత్రం చేయనున్నానని తెలిపారు. తమ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయన్న విషయం తెలుసన్నారు. ఇక పవన్ తో చేసిన పంజా గురించి విష్ణు వర్దన్ మాట్లాడుతూ..''పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేస్తానని... ఆ అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో ఎస్‌.జె.సూర్యకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన వల్లే అవకాశం దక్కింది'' అన్నారు విష్ణువర్థన్‌.

అజిత్ తాజా చిత్రం 'డేవిడ్ బిల్లా'మరో రికార్డుని క్రియేట్ చేసింది. ఈ చిత్రం పదమూడు ప్రెంచ్ సిటీలలో రిలీజవుతోంది. ఇలా ప్రెంచ్ సబ్ టైటిల్స్ ఇంత భారీగా రిలీజవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావటం విశేషం. అలాగే భారతీయ సినీ చరిత్రలోనే బిల్లా 2 చిత్రం తొలి ప్రీక్వెల్ చిత్రంగా రికార్డు సృష్టించింది. అజిత్‌ని స్టయిలిష్‌గా ఆవిష్కరించిన చిత్రం 'బిల్లా' చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం త్వరలో తెలుగులోకి డబ్ ఇక్కడ కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అందులోనూ ఈ చిత్రం సీక్వెల్ కాకుండా బిల్లాకు ప్రీక్వెల్ కావటంతో మరింత ఆసక్తి పెరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X