9 నుంచి గౌతమ్ మీనన్ కొత్త చిత్రం

By Srikanya

Ajith project with Gautam Menon commence on April 9th
చెన్నై : అజిత్‌తో తాను తెరకెక్కించనున్న చిత్ర షూటింగ్‌ను ఈ నెల 9వ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ అధికారికంగా ప్రకటించారు. ఆరంభం, వీరం తర్వాత అజిత్‌ నటించనున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా ఎమీ జాక్సన్‌, అనుష్క నటించనున్నారు. హారీష్‌జైరాజ్‌ స్వరాలు సమకూర్చనున్నారు. అరవింద్‌స్వామి, అరుణ్‌ విజయ్‌లు విలన్ లుగా కనిపించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలా ఉంటే పూజా కార్యక్రమంతో ఈ చిత్ర షూటింగ్‌ను ఈ నెల 9న ప్రారంభించనున్నారు. అనంతరం తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ ఇందులో అజిత్‌ను సరికొత్త గెటప్‌లో చూపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అజిత్‌ హెయిర్‌స్టెల్‌ వినూత్నంగా ఉండనుందని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

స్త్టెలిష్‌ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ అజిత్‌ చిత్రం ద్వారా ఈ మధ్యలో దూరమైన తన ఆస్థాన సంగీత దర్శకుడితో మళ్లీ చేయి కలిపాడు. ప్రేమకథ, ఎన్‌కౌంటర్‌ తరహా చిత్రాల ద్వారా దర్శకుడిగా తనకంటూ ఓ పంథాను సృష్టించుకున్న దర్శకుడు గౌతమ్‌మీనన్‌. తన తొలి చిత్రం మిన్నలే నుంచి కాక్కకాక్క, వేట్టయాడు విలైయాడు, వారనం ఆయురం అంటూ అన్ని చిత్రాలకు సంగీత బాధ్యతను హరీష్‌ జైరాజ్‌కే అప్పగించారు. ఆయన కూడా అంతే అద్భుతమైన సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించాడు.

అయితే అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవటంతో గౌతమ్‌ మీనన్‌ ఇతరుల వైపు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన రూపొందించిన 'విన్నైతాండి వరువాయా'కు ఏఆర్‌ రెహమన్‌, 'నీదానే ఎన్‌ పొన్‌ వసంతం'కు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ మీనన్‌తో హరీష్‌ మళ్లీ కలిసి పని చేయనున్నాడు., అజిత్‌ హీరోగా గౌతమ్‌ నిర్మించనున్న ఓ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అజిత్‌తో తనకు ఇదే తొలి చిత్రం కావటంతో అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట గౌతమ్‌ మీనన్‌. ఇందులో భాగంగా గతంలో తనకు ఎన్నో సూపర్‌హిట్‌ పాటలను అందించిన హరీష్‌ జైరాజ్‌ వైపే మొగ్గు చూపాడట.

నాగచైతన్యకి 'ఏ మాయ చేశావె" చిత్రంతో హిట్ ఇచ్చి కెరీర్ ఇచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చిత్రం అంటే హీరోలందరికీ ఆసక్తే. అయితే రీసెంట్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్యతో అనుకున్న చిత్రం ఆగిపోయింది. కథ కుదరలేదని మరీ సూర్య ఆ ప్రాజెక్టు ఆపుచేసి,మరో సినిమా ప్రారంభించేసాడు. అంతకుముందు విజయ్ సైతం గౌతమ్ మీనన్ కి హ్యాండ్ ఇచ్చాడు. అయితే గౌతమ్ మీనన్ మాత్రం సూపర్ స్టార్ హీరోతో జత కట్టేందుకు సిద్దమవుతున్నారు. ఆ స్టార్ హీరోనే అజిత్. అజిత్ ఇప్పుడు తమిళనాడులో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఆయన గౌతమ్ మీనన్ ని పిలిచి మరీ ప్రాజెక్టు అప్పచెప్పినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X