twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్‌ స్టంట్‌మాస్టర్‌ నే షాక్ చేసిన మన హీరో

    By Srikanya
    |

    చెన్నై : పంజా డైరక్టర్ విష్ణువర్దన్‌ దర్శకత్వంలో అజిత్‌ నటిస్తున్న చిత్రం 'వలై'. ఇటీవల ముంబయిలో షూటింగ్ జరిగింది. ప్రస్తుతం దుబాయ్‌లో 20 రోజులపాటు కొనసాగుతోంది. ఇక్కడ చిత్రంలోని కీలక ఘట్టాలైన రెండు భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. అందులోని తొలి బైక్‌రేస్‌ పోరాట సన్నివేశంలో అజిత్‌ డూప్‌లేకుండా నటించాడు. నిజజీవితంలోనే అజిత్‌ బైక్‌రేసర్‌ కావడంతో ఆ సీన్‌లో దర్శకుణ్ని సైతం ఆశ్చర్యపరిచేలా నటించాడట. అంతేకాదు.. ఆ సన్నివేశానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చిన హాలీవుడ్‌ స్టంట్‌మాస్టర్‌ కూడా అవాక్కయాడట. అధిక సీసీగల బైక్‌ను వేగంగా నడుపుతూ ఫైట్‌ చేశారు అజిత్‌.

    ఈ చిత్రంలో అజిత్ మిడిల్ ఏజ్ కంప్యూటర్ హాకర్ గా నటిస్తున్నాడు. ఇటీవల వచ్చిన 'గ్యాంబ్లర్' చిత్రం తర్వాత అజిత్ మళ్లీ ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నాడు. గతంలో వచ్చిన తమిళ చిత్రం 'బిల్లా'లో అజిత్-నయనతార మధ్య రొమాన్స్ బాగా పండాయి. మళ్లీ ఇందులో ఇద్దరు కలిసి నటిస్తుండటం అంచనాలను పెంచుతోంది.

    అజిత్ తర్వలో 'దరువు' దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయున్నట్లు తెలుస్తోంది. విజయ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శౌర్యం' చిత్రంతో దర్శకత్వం వైపు అడుగులు వేసిన కెమెరామెన్ శివ. అంతకు ముందు ఛాయాగ్రాహకుడిగా 'శ్రీరామ్‌', 'నేనున్నాను' లాంటి చిత్రాలకు పని చేశారు.

    అజిత్‌ ప్రస్తుతం వరుసపెట్టి చిత్రాలు చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లోనే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఎలాంటి వెన్నుదన్ను లేకుండా వెండితెరపైకి వచ్చి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎవరి కోసమూ తన వ్యక్తిత్వాన్ని వదులుకోని అజిత్‌ తనకెంతో ఇష్టమైన బైక్‌రేస్‌లకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ కారణంగా ఒకదశలో ఆయన సినిమాల మధ్య చాలా విరామమే వచ్చింది. అయితే అభిమానులు, నిర్మాతలను దృష్టిలోకి తీసుకుని తన పంథా మార్చుకున్నాడు. పూర్తిగా వెండితెరకే అంకితమైపోయాడు.

    English summary
    Ajith's new film which has been tentatively titled "Valai" with director Vishnuvardhan is progressing at a brisk pace. The shooting of the film is currently underway in Dubai. Arya, Nayantara and Taapsee are also part of the cast. Expectations are in all-time high for Ajith-Vishnuvardhan film. Even a single working still increases the curiosity among Thala fans, the latest working still of Ajith with the trendy Ducati 1200cc bike was a rage in social networking sites.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X