Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాలీవుడ్ స్టంట్‌మాస్టర్ నే షాక్ చేసిన మన హీరో
ఈ చిత్రంలో అజిత్ మిడిల్ ఏజ్ కంప్యూటర్ హాకర్ గా నటిస్తున్నాడు. ఇటీవల వచ్చిన 'గ్యాంబ్లర్' చిత్రం తర్వాత అజిత్ మళ్లీ ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నాడు. గతంలో వచ్చిన తమిళ చిత్రం 'బిల్లా'లో అజిత్-నయనతార మధ్య రొమాన్స్ బాగా పండాయి. మళ్లీ ఇందులో ఇద్దరు కలిసి నటిస్తుండటం అంచనాలను పెంచుతోంది.
అజిత్ తర్వలో 'దరువు' దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయున్నట్లు తెలుస్తోంది. విజయ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శౌర్యం' చిత్రంతో దర్శకత్వం వైపు అడుగులు వేసిన కెమెరామెన్ శివ. అంతకు ముందు ఛాయాగ్రాహకుడిగా 'శ్రీరామ్', 'నేనున్నాను' లాంటి చిత్రాలకు పని చేశారు.
అజిత్ ప్రస్తుతం వరుసపెట్టి చిత్రాలు చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లోనే కొత్త సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఎలాంటి వెన్నుదన్ను లేకుండా వెండితెరపైకి వచ్చి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎవరి కోసమూ తన వ్యక్తిత్వాన్ని వదులుకోని అజిత్ తనకెంతో ఇష్టమైన బైక్రేస్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ కారణంగా ఒకదశలో ఆయన సినిమాల మధ్య చాలా విరామమే వచ్చింది. అయితే అభిమానులు, నిర్మాతలను దృష్టిలోకి తీసుకుని తన పంథా మార్చుకున్నాడు. పూర్తిగా వెండితెరకే అంకితమైపోయాడు.