'పంజా' రిజల్ట్ చూసి పరారైన హీరో
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'పంజా'భాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. నెగిటివ్ టాక్ రావటంతో ఈ చిత్రం దర్శకుడు విష్ణు వర్ధన్ ప్లాన్ లు తలక్రిందులు అయ్యాయి. తెలుగులో అతను చేద్దామనుకున్న హీరోలెవరూ కథ వినటానికి కూడా ఆసక్తి చూపటం లేదు. సర్లే మనం గతంలో బిళ్లా వంటి మెగా హిట్ ఇచ్చిన అజిత్ తో అయినా ముందుకు వెళదామనకుంటూంటే అతను సైతం విష్ణు ఫోన్ ని లిప్ట్ చేయటం లేదని తమిళ మీడియా వ్యాఖ్యానిస్తోంది. దాంతో తను మళ్ళీ కొత్తగా తనను తానూ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్ధితి విష్ణు కి ఏర్పడింది. అజిత్ తాను ప్రస్తుతం చక్రి తోలేటి తో బిళ్లా 2 చేస్తున్నాను కాబట్టి తను మళ్లీ మాఫియా,స్టైలిష్ సబ్జెక్టులుకు కొంతకాలం దూరంగా ఉందామనుకుంటున్నట్లు చెప్పించినట్లు చెప్తున్నారు. దాంతో విష్ణు తన తదుపరి చిత్రం విజయ్ తో కానీ శింబుతో గానీ ప్లాన్ చేద్దామనుకుంటున్నాడు.
అయితే అతనికి మాత్రం తెలుగులో మరో హీరోతో చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఎన్టీఆర్ ని కానీ, మహేష్ బాబుని కానీ ఒప్పించి సినిమాచేసి ఇక్కడ మార్కెట్ ని గ్రాబ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. అయితే పంజా ప్లాప్ ని తన ఖాతాలో వేసుకోకుండా వేరే వారిపై ఆ నెపం నెట్టివేయగలిగితేనే తన తదుపరి చిత్రంకు మార్గం సుగమమవుతుంది. ఇంతకుముందు పవన్ ని డైరక్ట్ చేసి పులి వంటి డిజాస్టర్ ఇచ్చిన ఎస్ జె సూర్య సైతం ఇప్పుడు డైలమోలో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ పులి హీరోయిన్ పరిస్దితే పంజా హీరోయిన్స్ కు కూడా దక్కేటట్లు ఉంది. తెలుగులో ఎవరూ వీరి వంక చూడటం లేదు.


Click it and Unblock the Notifications











