అజిత్ నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది
'విశ్వాసం' తర్వాత అజిత్ నటిస్తున్న మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. 'నెర్కొండ పార్వాయ్' టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్లో సూపర్ హిట్ మూవీ 'పింక్' చిత్రానికి ఇది రీమేక్.
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. బేవ్యూస్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పి బేనర్లో ఆయన ఈ చిత్రం నిర్మిస్తున్నారు. తీరన్ మూవీ ఫేం హెచ్ వినోద్ దర్శకత్వం ' నెర్కొండ పార్వాయ్' చిత్రం తెరకెక్కుతోంది.

బాలీవుడ్ వెర్షన్ 'పింక్' చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తమిళం వెర్షన్ ' నెర్కొండ పార్వాయ్'లో అజిత్ చేస్తున్నారు. తాప్సీ పోషించిన పాత్రలో తమిళ నటి శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తోంది. ఈ చిత్రంలో ఇంకా విద్యా బాలన్, అధిక్ రవిచంద్రన్, అర్జున్ చిదంబరం, అభిరామి వెంకటచలం, ఆండ్రియా తరియాంగ్, అశ్విన్ రావు, సుజిత్ శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
విద్యాబాలన్‌కు తమిళంలో ఇదే తొలి చిత్రం. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా... నిరవ్ షా సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. గతంలో ఈ చిత్రం మేలో విడుదలవుతుందని ప్రచారం జరిగింది. అయితే రూమర్లకు తెర దించుతూ ఆగస్టు 10న సినిమా విడుదల చేయబోతున్నట్లు బోనీ కపూర్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











