ఫుల్ ఎమోషనల్‌గా తమిళ ‘పింక్’ .. ఇరుగదీసిన అజిత్, శ్రద్దా శ్రీనాథ్
బాలీవుడ్‌లో సినీ విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసల పొందిన చిత్రం పింక్. ప్రస్తుతం తమిళంలో ఈ చిత్రం నేర్కొండ పార్వాయి అనే పేరుతో రూపొందుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ బుధవారం (జూన్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నేర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్, జెర్సీ ఫేం శ్రద్దా శ్రీనాథ్ నటించారు. ఈ కీలక పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తారు.. హిందీలో ఈ పాత్రలను అమితాబ్, తాప్సీ పోషించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రాన్ని బోనికపూర్ నిర్మిస్తుండగా, హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు.

కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో లాయర్ పాత్రలో అజిత్ ఇరుగదీసినట్టు ట్రైలర్‌లో కనిపించింది. హిందీకి భిన్నంగా యాక్షన్ సీన్లు కూడా అజిత్‌కు పెట్టినట్టు స్పష్టమైంది. అజిత్ ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభిస్తున్నది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చింది. ట్రైలర్‌లోని కోర్టు సీన్లు భావోద్వేగంగా ఉండటంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.
నేర్కొండ పార్వాయి చిత్రం తర్వాత దర్శకుడు హెచ్ వినోద్, బోని కాంబినేషన్ రిపీట్ కానున్నది. అజిత్ కెరీర్‌లో 60వ చిత్రాన్ని వీరిద్దరూ కలిసి రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











