అజిత్ సత్తా అంటే అదే.. కేవలం 2 గంటల్లో 4 లక్షలు లైక్స్
బాలీవుడ్‌లో సినీ విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసల పొందిన చిత్రం పింక్. ప్రస్తుతం తమిళంలో ఈ చిత్రం నేర్కొండ పార్వాయి అనే పేరుతో రూపొందుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ బుధవారం (జూన్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్, జెర్సీ ఫేం శ్రద్దా శ్రీనాథ్ నటించారు. ఈ కీలక పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తారు.. హిందీలో ఈ పాత్రలను అమితాబ్, తాప్సీ పోషించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రాన్ని బోనికపూర్ నిర్మిస్తుండగా, హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు.
కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో లాయర్ పాత్రలో అజిత్ ఇరుగదీసినట్టు ట్రైలర్‌లో కనిపించింది. అజిత్ ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన రావడంతో ఈ టీజర్ రికార్డు స్థాయి లైక్స్‌ను సాధించింది. కేవలం 2 గంటల్లోనే ఈ ట్రైలర్ 4 లక్షల లైక్స్‌ను సాధించడంతో అజిత్ సత్తా తెలిసింది.

శ్రీదేవితో ఉన్న అనుబంధం కారణంగానే ఈ చిత్రంలో అజిత్ నటించినట్టు మీడియా రిపోర్ట్. ఈ చిత్రాన్ని బోనికపూర్ నిర్మిస్తూ.. కోలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నాడు. నేర్కొండ పార్వాయి చిత్రం తర్వాత దర్శకుడు హెచ్ వినోద్, బోని కాంబినేషన్ రిపీట్ కానున్నది. అజిత్ కెరీర్‌లో 60వ చిత్రాన్ని వీరిద్దరూ కలిసి రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











