అజిత్‌కు జోడీగా విద్యా బాలన్: ‘పింక్’ సౌత్ రీమేక్ పూర్తి వివరాలు ఇవే!

బాలీవుడ్ మూవీ 'పింక్' సౌత్‌లో అజిత్ హీరోగా రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. అజిత్ కెరీర్లో 59వ చిత్రమిది. బోనీ కపూర్ నిర్మించబోయే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు బయటకు వచ్చాయి.

ఈ చిత్రంలో అజిత్‌కు జోడీగా విద్యాబాలన్ నటించబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విద్యా.. పింక్ రీమేక్ ద్వారా తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు.

Ajiths Pink remake update: The Details Of The Rest Of The Star Cast Are Out!

ఒరిజినల్ హిందీ వెర్షన్ 'పింక్'లో తాప్సీ పోషించిన పాత్రను... తమిళంలో శ్రద్ధా శ్రీనాథ్ చేయబోతున్నారు. తమిళ టీవీ జర్నలిస్ట్ రంగరాజ్ పాండే కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు అభిరామి వెంకటాచలం, ఆండ్రియా తరియాంగ్, అర్జున్ చిదంబరం, అధిక్ రవిచంద్రన్, అశ్విన్ రావు, సుజిత్ శంకర్ ఇతర పాత్రల్లో నటించబోతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

ఇటీవల చిత్ర నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ.. అజిత్‌తో తమిళ సినిమా నిర్మించాలనేది తన భార్య శ్రీదేవి డ్రీమ్ అని తెలిపారు. గతంలో శ్రీదేవి కంబ్యాక్ చిత్రం 'ఇంగ్లిష్-వింగ్లిష్' చిత్రంలో అజిత్ అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి శ్రీదేవి, అజిత్ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే తమ బేనర్లో అజిత్ హీరోగా తమిళ సినిమా నిర్మించాలని శ్రీదేవి డిసైడ్ అయ్యారు. అయితే అది నెరవేరకుండానే శ్రీదేవి గతేడాది ప్రమాద వశాత్తు మరణించారు.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ మూవీ ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకుని ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు మరో మూవీ కూడా బోనీ కపూర్ నిర్మాణంలో అజిత్ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X