ఇద్దరు స్టార్ హీరోల బాక్సాఫీస్ వార్.. బయ్యర్లలో భయం!
సూపర్ స్టార్ రజనీకాంత్, మరో స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయంటూ వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. రజనీకాంత్ ప్రస్తుతం కార్తీ సుబ్బరాజ్ దర్శత్వంలో పెట్ట చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే అజిత్ తనకు అచొచ్చిన శివ దర్శత్వంలో విశ్వాసం చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజగా తమిళ సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాలకు ఒకే విడుదల తేదీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇరు చిత్రాల నిర్మాతల మధ్య సమన్వయ లోపం కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

దీనితో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఓపెనింగ్స్ పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇరు చిత్రాల నిర్మాతలు కలసి చర్చించుకుని విడుదల తేదీలు మార్చాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











