మళ్లీ అమ్మానాన్న కాబోతున్న అజిత్-శాలిని
హైదరాబాద్: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, శాలిని దంపతులు మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పటికే ఒక పాపకు జన్మనిచ్చిన ఈ స్టార్ కపుల్ త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. శాలిని గర్భం దాల్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే వారిద్దరి నుండి ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
అజిత్, శాలిని ఇద్దరూ సినీ నటులు. పెళ్లికి ముందే పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ 'అమరకలమ్' అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో వీరిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చివరకు మీడియా సాక్షిగా వారు తమ ప్రేమ విషయాన్ని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 24, 2000లో వివాహం చేసుకున్నారు.
అజిత్, శాలిని మతాంతర వివాహం చేసుకున్నారు. అజిత్ కుమార్ హిందూ అయితే, శాలిని క్రిస్టియన్. వీరి వివాహం హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. పెళ్లి తర్వాత కూడా శాలిని తను కమిటైన రెండు ప్రాజెక్టులను పూర్తి చేసారు. ఆ తర్వాత సినిమాకు గుడ్ బై చెప్పారు.
వీరికి 2008 జనవరి 8వ తేదీన పాప జన్మించింది. తమ కూతురుకి అనౌష్క అనే పేరు పెట్టుకున్నారు.

అనౌష్కతో అజిత్, శాలిని
తమ ముద్దుల కూతురు అనౌష్కతో స్టార్ కపుల్ అజిత్, శాలిని.

కూతురంటే ప్రేమ..
అజిత్, శాలినిలకు తమ కూతురు అనౌష్క అంటే ఎంతో ప్రేమ. అఫ్ కోర్స్ తల్లిదండ్రులెవరికైనా తమ బిడ్డలంటే ఎనలేని ప్రేమ ఉంటుంది.

కూతురుతో సంతోష సమయంలో..
కూతురు అనౌష్కతో సంతోషంగా గడుపుతున్న హీరో అజిత్, శాలిని.

లిటిల్ అనౌష్క
అజిత్, శాలినిల కూతురు అనౌష్క ఎంతో ముద్దొస్తోంది కదూ....

కూతురుతో శాలిని..
ఆ మధ్య ఓ కార్యక్రమానికి హాజరైన శాలిని....తన కూతురు అనౌష్కతో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

అనౌష్కతో అజిత్
కూతురు అనౌష్కకు డ్రాయింగ్ నేర్పిస్తున్న అజిత్.

కూతురితో లవ్లీ కపుల్
కూతురు అనౌష్కతో లవ్లీ కపుల్ అజిత్, శాలిని.

క్రిస్ మస్ టైం
భార్య శాలిని, కూతురు అనౌష్కతో కలిసి క్రిస్ మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న అజిత్.


Click it and Unblock the Notifications











