హీరో అజిత్ పెద్ద మనసు: విశ్వాసంతో రూ. 50 కోట్ల నష్టాన్ని పూడ్చడానికి...

By Bojja Kumar

Recommended Video

Ajith Accepts New Movie To Replace Disaster Of 'VIVEGAM'

అజిత్ హీరోగా వచ్చిన 'వివేకం' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో చిత్ర నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. తమిళనాడులో పెద్ద స్టార్ హోదాలో ఉన్న ఆయన ఆ నష్టాన్ని పూడ్చడానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని నిర్మాత కె రాజన్ స్వయంగా వెల్లడించారు.

రూ. 50 కోట్ల నష్టం

రూ. 50 కోట్ల నష్టం

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కె రాజన్ మాట్లాడుతూ...‘వివేకం' సినిమా బాక్సాఫీసు వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. దీని వల్ల రూ. 50 కోట్ల నష్టం వచ్చింది. ఈ నష్టాలను పూడ్చడానికే అజిత్ ‘విశ్వాసం' సినిమా చేస్తున్నారు అని తెలిపారు.

దర్శకుల అసమర్ధత వల్లే

దర్శకుల అసమర్ధత వల్లే

ఈ సందర్భంగా కె రాజన్ దర్శకుల తీరుపై మండి పడ్డారు. దర్శకులు తాము ముందుగా చెప్పిన డేట్స్, ఫిక్డ్స్ బడ్జెట్‌లో సినిమాను పూర్తిచేయడంలో విఫలం అవుతున్నారని, దీని వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయని తెలిపారు.

సీరియస్‌గా చెప్పారు

సీరియస్‌గా చెప్పారు

సిరుతై శివ దర్శకత్వంలో వచ్చిన వివేకం సినిమా నష్టాలు పాలు కావడం వల్లనే అతడి దర్శకత్వంలో మరో సినిమా ‘విశ్వాసం' సినిమా చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నష్టాలు పూడ్చాలని అజిత్ ముందుకు వచ్చారని తెలిపారు. ఈ సినిమాను అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయాలని అజిత్ దర్శకుడికి సీరియస్‌గా చెప్పారన్నారు.

స్ట్రైక్ కారణంగా ఆలస్యం

స్ట్రైక్ కారణంగా ఆలస్యం

విశ్వాసం సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా... కోలీవుడ్లో జరుగుతున్న స్ట్రైక్ కారణంగా ఇంకా మొదలు కాలేదు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి దిపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార హీరోయిన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X