'పంజా'దర్శకుడు తదుపరి చిత్రం ఖరారు
పవన్ కళ్యాణ్ తో పంజా చిత్రం రూపొందించిన విష్ణు వర్ధన్ తదుపరి చిత్రం దాదాపు ఖరారు అయినట్లే. అయితే ఆయన తన తిరిగి తమిళంలోనే ఆ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రంలో అజిత్ హీరోగా చేయనున్నారు. గతంలో అజిత్, విష్ణు వర్ధన్ కాంబినేషన్ లో బిల్లా చిత్రం వచ్చి సంచలనం క్రియేట్ చేసింది. దాంతో వీరి కాంబినేషన్ పై అక్కడ మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అజిత్ బిల్లా- 2 చేస్తున్నారు. నిజానికి బిల్లా చిత్రానికి దర్శకత్వం వహించిన విష్ణువర్దన్‌నే బిల్లా -2 కు పని చేయాల్సింది. ఆయన తెలుగు చిత్రం పంజాను ఒప్పుకోవడంతో బిల్లా- 2కు చక్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అజిత్,విష్ణువర్దన్‌ల కాంబినేషన్‌లో మరో చిత్రం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బిల్లా తర్వాత అజిత్‌తో మరో చిత్రం చేయనున్నానని తెలిపారు. తమ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయన్న విషయం తెలుసన్నారు. ప్రస్తుతం బిల్లా -2లో నటిస్తున్న అజిత్ మరోసారి దాదాగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ తో చేసిన పంజా గురించి విష్ణు వర్దన్ మాట్లాడుతూ..''పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తానని... ఆ అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో ఎస్.జె.సూర్యకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన వల్లే అవకాశం దక్కింది'' అన్నారు విష్ణువర్థన్.


Click it and Unblock the Notifications











