అజిత్ భార్య షాలిని చేతిలో ఆ ఫోన్.. ఆశ్చర్యపోతున్న అభిమానులు!

సినీ స్టార్స్ కోరుకుంటే ఎలాంటి విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపవచ్చు. కానీ చాలా మంది స్టార్ హీరోలు సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి హీరోల్లో తమిళ స్టార్ హీరో అజిత్ ఒకరు. అజిత్ కోలీవుడ్ లో తిరుగులేని హీరో. అజిత్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. కానీ అజిత్ మాత్రం ఎలాంటి హంగులు, ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా ఉన్నారు. ఈ క్వాలిటీని అజిత్ అని అభిమానులకు మరింత చేరువ చేసింది. కాగా అజిత్ సతీమణి షాలిని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికి ఆ ఫొనేనా

ఇప్పటికి ఆ ఫొనేనా

అజిత్ సతీమణి షాలిని ఇటీవల అభిమానులతో సెల్ఫీకి ఫోజులిచ్చింది. షాలిని చేతిలో పాత మోడల్ నోకియా 3310 ఫోన్ ఉంది. ఈ ఫోన్ చూసి అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక స్టార్ హీరో సతీమణి అయి ఉండి కూడా ఇప్పటికి ఇదే ఫోన్ వాడుతున్నారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

 సింపుల్‌గా జీవితం

సింపుల్‌గా జీవితం

అజిత్ తో వివాహం తర్వాత షాలిని సినిమాలకు దూరమైంది. సింపుల్ గా ఉండే ఫోన్,. సింపుల్ గా ఉండే జీవితం అని అభిమానులు షాలినిని ఉద్దేశించి కామెంట్స్ పెడుతున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, బ్రహ్మపుత్రులు లాంటి తెలుగు చిత్రాల్లో షాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. తమిళ, మలయాళీ భాషల్లో అనేక చిత్రాల్లో షాలిని బాలనటిగా ఎన్నో చిత్రాల్లో రాణించింది.

అజిత్‌తో వివాహం

అజిత్‌తో వివాహం

హీరోయిన్ గా కూడా షాలిని కొన్ని చిత్రాల్లో నటించింది. 2000 సంవత్సరంలో అజిత్ ని పెళ్లి చేసుకోవడంతో షాలిని నటనా జీవితానికి గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం అజిత్ సతీమణిగా కుటుంబ భాద్యతలు నిర్వహిస్తోంది. అజిత్ తో కలసి తప్ప మిగిలిన సందర్భాల్లో షాలిని మీడియాకు కనిపించరు.

 విడుదలకు సిద్ధం

విడుదలకు సిద్ధం

ఇక అజిత్ నటించిన విశ్వాసం చిత్రం మార్చి 1న తెలుగులో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సంక్రాంతికి విడుదలైన విశ్వాసం ఘనవిజయం సాధించింది. దీనితో తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అజిత్, నయనతార ఈ చిత్రంలో జంటగా నటించారు. శివ, అజిత్ కాంబినేషన్ లో వరుసగా నాలుగోసారి వచ్చిన చిత్రం ఇది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X