Akhanda 2: అఖండ 2 విడుదల నిలిపివేత.. బాలకృష్ణ మూవీకి కోర్టు షాక్

అఖండ 2 సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఈ సినిమాకు భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ (Eros) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ కోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఎరోస్ సంస్థతో వివాదం పరిష్కారం అయ్యేంత వరకు సినిమాను విడుదల చేయకూడదని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నది. ఈ వివాదానికి సంబంధించిన వార్త వివరాల్లోకి వెళితే..

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 తాండవం డిసెంబర్ 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. అయితే గతంలో ఈ సంస్థకు ఎరోస్ సంస్థతో ఉన్న ఆర్థిక లావాదేవీలు వివాదాస్పద కావడంతో సంచలనంగా మారింది.

Akhanda 2 Movie Release faces legal stay from Madras High Court

ఎరోస్ సంస్థకు అఖండ 2 నిర్మాతలకు గతంలో చేసుకొన్న ఒప్పందం ప్రకారం సుమారుగా 28 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే వాటి చెల్లింపు కోసం పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కానీ వాటి చెల్లింపు జరగకపోవడంతో ఎరోస్ సంస్థ మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇచ్చిన తర్వాతే అఖండ 2 సినిమా విడుదలకు అనుమతించాలని ఎరోస్ లీగల్ టీమ్ పీఎస్ రామన్, ఏఆర్ఎల్ సుందరేశన్, నిత్యాయేష్ నటరాజ్ కూడిన బృందం కోర్టును వేడుకొన్నారు.

14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్‌పీ సంస్థకు గతంలో 17 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుబంధం ఉంది. తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా అఖండ 2 సినిమాను రిలీజ్ చేస్తున్నదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎరోస్ సంస్థ పిటిషన్ విచారించిన కోర్టు.. 28 కోట్ల రూపాయలతోపాటు అదనంగా 14 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ వివాదం పరిష్కారం కానంత వరకు సినిమాను రిలీజ్ చేయడానికి వీలు లేదు అంటూ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ పిటిషన్‌ను జస్టిస్ సుబ్రమణ్యం, జస్టిస్ కుమారప్పన్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం.. సినిమా విడుదల, డిస్ట్రిబ్యూషన్, వ్యాపార, వాణిజ్యపరమైన లావాదేవీలు జరపకూడదని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X