»   » అఖిల్ అక్కినేని ‘సూర్య కవచం’

అఖిల్ అక్కినేని ‘సూర్య కవచం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ‘అఖిల్' సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కాబోతోంది. తమిళ వెర్షన్ డబ్బింగ్ రైట్స్ ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తమిళంలో ‘సూర్య కవచం' అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

త్వరలో చెన్నైలో ‘సూర్య కవచం' ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ ద్వారా అఖిల్ తమిళ ప్రేక్షకులకు పరిచయం అయితే తమిళ మార్కెట్లో అఖిల్ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు అఖిల్ సినిమా తమిళ రైట్స్ దక్కించుకున్నసి.కళ్యాణ్ రజనీకాంత్ ఆహ్వానించినట్లు సమాచారం.


Akhil movie has been titled Surya Kavacham in Tamil

ప్రస్తుతం రజనీకాంత్ తమిళ చిత్రం ‘కబలి' చిత్రం షూటింగులో బిజీగా గడపుతున్నారు. అయితే రజనీకాంత్ వచ్చే విషయం ఖరారు కావాల్సి ఉంది. రజనీకాంత్‌కు ఎప్పుడు వీలైతే అప్పుడే ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్టోబర్ 22న తెలుగుతో పాటు తమిళంలో ‘అఖిల్' సినిమా విడుదల కాబోతోంది.


అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.


ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akhil Akkineni’s debut film, ‘Akhil’ will also be releasing in Tamil simultaneously. Producer C Kalyan grabbed the rights for the film’s Tamil version. As per the latest reports, the dubbed version has been titled Surya Kavacham in Tamil.
Please Wait while comments are loading...