నా ప్రైవేట్ ఫోటోలు లీక్ చేశారు.. వాళ్ళందరిని బయటకు తీస్తా.. అక్షర హాసన్ వార్నింగ్!

Recommended Video

Akshara Responds On Her Viral Photos In Social Media

లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఇప్పటికే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. కమల్ రెండవ కుమార్తె అక్షర హాసన్ కూడా ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలని అందుకుంటోంది. నటిగా నిరూపించుకునేందుకు అక్షర హాసన్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల అక్షర హాసన్ కి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం సినీవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఫోటోల లీక్ పై తాజాగా అక్షర హాసన్ స్పందించింది.

అక్షర హాసన్ సెల్ఫీలు

అక్షర హాసన్ సెల్ఫీలు

అక్షర హాసన్ బికినీ ధరించి ప్రైవేట్ గా తన రూమ్ లో సెల్ఫీలు తీసుకుంటున్నట్లు ఆ ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలు లీక్ అయిన క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ఆ సంధర్భంలో కమల్ కుటుంబ సభ్యులు ఎవరూ లీకేజి గురించి స్పందించలేదు. తాజాగా అక్షర హాసన్ స్పందిస్తూ సంచలన విషయాలు తెలియజేసింది.

 ఎవరు చేశారో తెలియదు

ఎవరు చేశారో తెలియదు

అక్షర హాసన్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ ఫోటోల లీక్ గురించి స్పందించింది. ఇటీవల నా ప్రైవేట్ ఫోటోలు కొన్ని ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఎవరు చేసారు.. ఎందుకు చేశారు.. ఈ పని చేయడం వలన వాళ్లకు ఏంటి ఉపయోగం అనే విషయాలు నాకు ఇంకా తెలియదు. కానీ ఒక యువతిని ఇలా వేధించడం వలన వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారంటే వాళ్ళ మానసిక పరిస్థితి అర్థం అవుతోంది.

చాలా భయం వేస్తోంది

చాలా భయం వేస్తోంది

ఫోటోలు లీక్ అయిన తరువాత చాలా మంది వాటిని షేర్ చేశారు. అసభ్యకరమైన కామెంట్స్ పెట్టారు. లీక్ చేసిన వాళ్లే కాదు షేర్ చేసిన వాళ్ళు కూడా నన్ను వేధించినట్లే. సోషల్ మీడియాలో షేర్ చేసినవాళ్లు చాలా మంది ఉన్నారు. ఒక అమ్మాయిని వేధించడానికి ఇంతమంది ఉన్నారా అనే భయాందోళన నాలో కలుగుతోంది.

మీటూ ఉద్యమంతో మేల్కొంటున్నారు

మీటూ ఉద్యమంతో మేల్కొంటున్నారు

మన దేశంలో ఇప్పుడిప్పుడే మీటూ ఉద్యమంతో అంతా మేల్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఓక యువతి ప్రైవేట్ ఫొటోలతో ఆనందించేవారుండడం నిజంగా దురదృష్టకరం అంటూ అక్షరహాసన్ తెలిపింది. ఫోటోల లీక్ పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

అందరిని బయటకు లాగుతా

ఈ విషయం గురించి పోలిసులని కలసి ఫిర్యాదు చేశా. సైబర్ క్రైం డిపార్ట్ మెంట్ ని కూడా కలిశా. దీనికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా వారిని బయటకు తీస్తా అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. మన ప్రవర్తన బతుకుతూ అందరిని బతికించే విధంగా ఉండాలని అక్షర హాసన్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X