సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో కమల్ కూతురు షాకింగ్ డెసిషన్

విశ్వ నాయకుడు కమల్ హాసన్ తన విలక్షణ నటనతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం కోలీవుడ్‌కే పరిమితం కాకుండా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. ఆయన తర్వాత పెద్ద కుమార్తె శృతీ హాసన్ కూడా దాదాపు అన్ని భాషల్లో నటించింది. నటిగానే కాకుండా మ్యూజిక్ కంపోజర్, సింగర్‌గా ఆమె మంచి పేరు దక్కించుకుంది. వీళ్లిద్దరి తర్వాత ఆ ఇంటి నుంచి కమల్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా కొద్దిరోజుల క్రితం వెండి తెరపై మెరిసింది. ఈమె డైరెక్టుగా బాలీవుడ్ సినిమాతోనే తెరంగేట్రం చేయడం విశేషం.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్, తమిళ నటుడు ధనుష్‌ కలయికలో వచ్చిన 'సమితాబ్' చిత్రం ద్వారా అక్షర హాసన్ సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత దీని తర్వాత అజిత్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. అలాగే ఈ మధ్య వచ్చిన విక్రమ్ సినిమా 'మిస్టర్ కేకే'లో కూడా కీలక పాత్రలో నటించింది. దీని తర్వాత ఆమె మరో సినిమాకు సంతకం చేయలేదు. ఇప్పటి వరకు హీరోయిన్ పాత్రలో చేయలేదు. సో.. ఇకపై తనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తానని కండీషన్ పెట్టింది.

Akshara Haasan Shocking Decision

దీంతో ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఇక, చేసేదేం లేక ఆమె ఖాళీగానే ఉండిపోతోంది. ఈ నేపథ్యంలో అక్షర హాసన్ సినిమాలను ఆపేసి వెబ్ సిరీస్‌లపై వెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ సిరీస్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా శివ శంకర్ అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఇందులో నటి సునయన, గాయత్రి వంటి ముఖ్య నటలు కూడా చేస్తున్నారు. దీనిని ప్రముఖ దర్శకుడు విష్ణువర్ధన్ నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ పూర్తి స్థాయిలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని తెలుస్తోంది. దీనికి 'ఫింగర్ టిప్' అనే టైటిల్ పెట్టారు.

మరోవైపు, ఆమె అక్క శృతీ హాసన్ కూడా గతంలో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించింది. అందులో ఒక హాలీవుడ్ సిరీస్ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఆమె సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. కొద్దిరోజుల క్రితం సినిమా కెరీర్‌కు తాత్కాలికంగా బ్రేకిచ్చిన శృతి.. మరోసారి కెరీర్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పలు చిత్రాలకు సంతకాలు చేసింది. ఇక, వీళ్లిద్దరి తండ్రి కమల్ హాసన్ 'బిగ్ బాస్' తమిళం సీజన్ - 3కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X