శృతి హాసన్ చెల్లెలు కూడా మొదలెట్టింది
కమల్ రెండో కూతురు, శృతి హాసన్ సోదరి అయిన అక్షర హాసన్ త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో కనిపించటానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ మేరకు ఆమె ఓ ప్రముఖ దర్సకుడుతో ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఆమె డైరక్షన్ డిపార్టమెంట్ లో చేద్దామనుకుంది కానీ చాలామంది ఆమెను నటిగా ప్రయత్నించమనటంతో ఆ ప్రయత్నాలు మొదలెట్టింది. మొదటి సినిమా వరకూ పెద్ద ప్రయత్నమేమీ చేయకుండానే ఆఫర్ లభించింది.ఇప్పుడామె ప్రూవ్ చేసుకుంటే తన సోదరి తో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకునే అవకాసం ఉంది.
మరో ప్రక్క అక్షర హాసన్ రచయిత్రిగా ప్రయత్నాలు చేస్తోంది. ఓ హిందీ చిత్రానికి ఆమె అప్రెంటిస్‌గా చేసిన ఆమె పనిలో పనిగా తనకు నచ్చిన జానపద కథలను సోషలైజ్ చేసుకుంటూ అనేక మంది నిర్మాతలకు వినిపిస్తోంది. ఈ కథలను మొదట తండ్రి కమలహాసన్‌కు వినిపిస్తోంది. ఆమె రాసిన కథల్లో తంజావూరు చోళ రాజు కథ ఎంతో నచ్చిందిట. అందుకే తాను కూడా ఆ కథను చిత్రంగా నిర్మించాలని నిర్మాతల వేటలో పడ్డాడు. నేను నిర్మాతగా సినిమా తీయకపోయినా అందులో హీరోగా మాత్రం నటిస్తానని భరోసా ఇస్తున్నాడు కమల్.మరి మొదట దర్శకురాలుగా ఎంట్రీ ఇస్తుందా ఆర్టిస్టుగా అదరకొడ్తుందో,రచయిత్రిగా విజృంభిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











