For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షూటింగ్ లో బిజీగా కమల్ రెండో కూతురు

  By Srikanya
  |
   Akshara Hassan
  చెన్నై : కమల్‌ చిన్న కుమార్తె అక్షర నటిగా తొలి సన్నివేశాలను పూర్తి చేసింది. తన అక్క దారిలోనే ఆమె కూడా ప్రయాణం పెట్టుకుంది. మొదట్లో దర్శకత్వ విభాగంలో పనిచేసిన ఆమె చివరకు హీరోయిన్ గానే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె ఓ హిందీ చిత్రం కమిటై కంటిన్యూ షూటింగ్ లో పాల్గొంటోంది. ఆమె చాలా తపనతో,పద్దతిగా సీనియర్ హీరోయిన్ లా షూటింగ్ లో పాల్గొంటోందని ప్రసంశలు వినిపిస్తోంది.

  హిందీలో 'లక్‌'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కమల్‌ పెద్ద కుమార్తె శ్రుతిహాసన్‌ తమిళంలో ధనుష్‌కు జంటగా '3'లో నటించింది. కమల్‌ చిన్న కుమార్తె అక్షరను కూడా తమిళంలో హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు పలువురు దర్శకులు పోటీపడినా.. తన దృష్టంతా దర్శకత్వం మీదే అంటూ ఆ అవకాశాలను తోసిపుచ్చింది. అయితే 'రాంఝానా'తో హిందీకి పరిచయమైన ధనుష్‌ తాజాగా పాల్కి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.

  ఇందులో ధనుష్‌కి జంటగా అక్షరను ఎంపిక చేయటంలో దర్శకనిర్మాతలు సఫలమయ్యారు. అలా నటించేందుకు అంగీకరించిన అక్షర తన శరీరాకృతిని తీర్చిదిద్దుకోవటంపై దృష్టి సారించిందట. అనంతరం ఆమె ఇటీవల షూటింగ్‌లో కూడా పాల్గొందట. ధనుష్‌తో కలిసి కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించిందట. నటనపై ఆమె అంకితభావాన్ని చూసిన చిత్రయూనిట్‌... ఎంతైనా కమల్‌ కుమార్తె కదా అని మెచ్చుకుందట. నటిగా అగ్ర స్థానానికి చేరుకుంటుందని కూడా కితాబిచ్చిందట. ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

  మాజీ నటి సారిక తన రెండో కూతురు అక్షర్ హాసన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటంపై ఎంతో సంతోషంగా ఉంది. అయితే తన కూతురుకు పరిశ్రమలో ఎలా పైకి రావాలనే విషయమై ఎలాంటి టిప్స్ చెప్పబోనని అంటోంది. ఎందుకంటే తన కూతురు తనదైన సొంత స్టైల్‌లో దూసుకెలుతుందనేనమ్మకం వ్యక్తం చేస్తోంది సారిక. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...'ప్రతి జనరేషన్ వారి వారి సొంత అభిరుచులు, వర్కింగ్ స్టైల్ కలిగి ఉంటారు. మన అభిప్రాయాలు వారిపై రుద్దడం సరికాదు. సినిమా రంగాన్ని వారికి పరిచయం చేయడం మాత్రమే మన బాధ్యత. నా కూతురు తప్పకుండా తనదైన సొంత స్టైల్లో ఈ రంగంలో సత్తా చాటుతుందనే నమ్మకం నాకు ఉంది. అక్షర తెరంగ్రేటానికి ఇదే మంచి సమయం. నా ఇద్దరు కూతుర్లు శృతి హాసన్, అక్షర్ హాసన్‌ల విషయంలో నేను పూర్త సంతృప్తిగా ఉన్నాను' అని సారిక చెప్పుకొచ్చారు.

  English summary
  
 Dhanush and Akshara Hassan's untitled movie took off recently without much fan fare. The shooting of the film has begun in Igatpuri, Maharashtra. The forthcoming movie is directed by R Balki of Paa and Cheeni Kum fame. The film marks the debut of Kamal Hassan's younger daughter Akshara Hassan. It is a romantic movie, which will be simultenously made in Hindi and Tamil.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X