ఒళ్ళు గగుర్పొడిచేలా అక్షయ్ కుమార్.. ఐదవ శక్తి వస్తోంది, భయంకర రూపంలో!

Recommended Video

Akshay Kumar Photo Goes Viral In Social Media

వినాయక చవితికి శంకర్ 2.0 చిత్రం టీజర్ తో సందడి చేసింది. ఇప్పుడు దీపావళి సంబరాల ముందు ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఆసక్తికరమైన పోస్టర్స్ విడుదల చేస్తూ 2.0 చిత్ర యూనిట్ ప్రచారం చేస్తోంది.భారత సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. దీనితో శంకర్ ట్రైలర్ రూపొందించడంలో జాగ్రత్తలు వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐదవ శక్తి వస్తోంది

ఐదవ శక్తి వస్తోంది

తాజాగా అక్షయ్ కుమార్ తన ట్విటర్ లో 2.0 పోస్టర్ విడుదల చేశారు. ఐదవ శక్తి వస్తోంది. మనుషుల్లారా జాగ్రత్త అంటూకామెంట్ పెట్టాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ వింత ఆకారంలో ఉంటూ మొబైల్ ఫాన్స్ ని కంట్రోల్ చేసే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఒళ్ళు గగుర్పొడిచేలా

తాజాగా అక్షయ్ కుమార్ విడుదల చేసిన పోస్టర్ లో అతడి రూపం ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంది. చిట్టి రోబోగా రజని, సూపర్ విలన్ గా అక్షయ్ కుమార్ మధ్య పోరాటం తారాస్థాయిలో ఉండబోతోంది. రోబో చిత్రంలో చిట్టినే ప్రతినాయకుడిగా మరి విధ్వంసం సృష్టిస్తాడు. ఇప్పుడు 2.0 చిత్రంలో అక్షయ్ కుమార్ నుంచి మానవాళిని రక్షించే భాద్యత తీసుకుంటాడు.

ప్రపంచ వ్యాప్తంగా

ప్రపంచ వ్యాప్తంగా

ఈ చిత్ర విఎఫ్ఎక్స్ రూపకల్పనలో హాలీవుడ్ లో ప్రసిద్దిగాంచిన సాంకేతిక నిపుణులంతా 2.0 చిత్రం కోసం పనిచేయడం విశేషం. మునుపెన్నడూ చూడని విధంగా, హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా ఈ చిత్రంలో శంకర్ విజువల్స్ రూపొందించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ లో సింహభాగం గ్రాఫిక్స్ రూపొందించేందుకే ఖర్చుచేశారట.

అందాల రోబోగా

అందాల రోబోగా

అమీజాక్సన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అమీజాక్సన్ కూడా ఈ చిత్రంలో రోబోగా కనిపిస్తుందట. ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ ఆసక్తికరంగా మారాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X