అక్షయ్ కుమార్ నెక్ట్స్ ఆ సౌత్ రీమేక్ లో...
విక్రమార్కుడు రీమేక్ 'రౌడీ రాథోర్'లో చేసి హిట్ కొట్టిన అక్షయ్ కుమార్ మరో రీమేక్ కు అప్పుడే రెడీ అవుతున్నారు. ఆ రీమేక్ ఏమిటంటే..విజయ్ తాజా చిత్రం తుపాకి. ఈ చిత్రం స్టోరీ లైన్ విన్న అక్షయ్ కుమార్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. తుపాకి తమిళ వెర్షన్ పూర్తి కాగానే హిందీలో మొదలు కానుంది. అక్కడ కూడా మురగదాస్ డైరక్ట్ చేయనున్నారు. మురగదాస్ గతంలో అమీర్ ఖాన్ తో గజనీ చిత్రం రూపొందించి ఘన విజయం సాదించారు.
ఈ విషయాన్ని మురగదాస్ ఖరారు చేస్తూ...నేను ఎప్పుడెప్పుడు అక్షయ్ కుమార్ తో చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. తమిళ తుపాకి వెర్షన్ పూర్తి కాగానే అక్కడ పని ప్రారంభిస్తాను. నేను చెప్పిన స్క్రిప్టు విన్న అక్షయ్ కుమార్ చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే మొదలపెట్టమని డేట్స్ కేటాయించారు. తప్పకుండా హిందీలో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది అన్నారు.
తమిళ హీరో విజయ్, కాజల్ జంటగా రూపొందుతున్న చిత్రానికి తెలుగులో 'తుపాకి' అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.
ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. తమిళంలో 'మాళై నీరతు మళియతుల్లి' అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











