మైండ్ బ్లోయింగ్.. ఏంటీ అరాచకం అక్షయ్.. అంచనాలు పెంచేస్తున్న 2.0!
Recommended Video

దిగ్గజ దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణనటుడు అక్షయ్ కుమార్ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న 2.0 చిత్ర విడుదలకు మరికొన్నిరోజులు మాత్రమే మిగిలిఉంది. ఈ చిత్రం మన ఊహకు కూడా అందని విధంగా ఉండబోతోందని శంకర్ ట్రైలర్ ద్వారా తేల్చేశాడు. ఈ విజువల్ వండర్ ని ఆస్వాదించడానికి ఆడియన్స్ అంతా సిద్ధం అయిపోయారు. చిత్ర యూనిట్ చేస్తున్న ప్రచార కార్యక్రమాలు సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచేస్తున్నాయి.

చిట్టి వర్సస్ సూపర్ విలన్
రోబో చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చిట్టి రోబోగా చేసిన సందడి అంత ఇంతా కాదు. తాను ఎంత భారీ స్థాయిలో ఆడియన్స్ కు వినోదాన్ని పంచగలనో శంకర్ ఈ చిత్రంలో చూపించాడు. ఇప్పుడు అంతకు మించి బడ్జెట్, కళ్ళుచెదిరే విజువల్స్ తో 2.0 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. చిట్టి రోబోగా రజని, సూపర్ విలన్ గా అక్షయ్ కుమార్ మధ్య జరిగే పోరాటం కోసం ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

భయంకరమైన రూపాలు
చిట్టి పాత్ర గురించి ప్రేక్షకులందరికీ ఓ అవగాహన ఉంది. రోబో చిత్రంతో పోలచుకుంటే ఈ చిత్రంలో చిట్టి ఏమైనా భిన్నంగా ఉంటాడేమో చూడాలి. కానీ అక్షయ్ కుమార్ పాత్ర మాత్రం విపరీతమైన క్యూరియాసిటీ కలిగిస్తోంది. వివిధ రూపాల్లోకి మారిపోయి మానవజాతిని నాశనం చేసే సూపర్ విలన్ గా అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు.
అరాచకం అనాల్సిందే
తాజాగా అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబందించిన పోస్టర్ ని ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్ చూడగానే అరాచకం అని అంటారు. అంత భయంకరంగా అక్షయ కుమార్ భారీ రూపణలో కనిపిస్తున్నాడు. అక్షయ్ కుమార్ శరీరం మొత్తం మొబైల్ ఫోన్స్ తో కనిపిస్తోంది. ట్రైలర్ టీజర్స్ లో కూడా మొబైల్ ఫోన్స్ పైనే ఎక్కువఆ ఫోకస్ పెట్టారు. తుఫాన్ వస్తోంది సిద్ధంగా ఉన్నారా అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు.

మొబైల్ ఫోన్ వ్యసనం
జరుగుతున్న ప్రచారం ప్రకారం శంకర్ ఈ చిత్రాన్ని మొబైల్ ఫోన్స్ వ్యసనానికి సంబంధించి సందేశాత్మకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ మొబైల్ ఫోన్ కి బానిసగా మారి మరణించిన తరువాత ఇలా దుష్టశక్తిగా అవతరిస్తాడట. అదే ఈ చిత్రంలోని కీలక పాయింట్ అని అంటున్నారు. నవంబర్ 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











