'రోబో 2' లో అక్షయ్ గెటప్ లీక్...కాకి లా ఉన్నాడు (ఫొటోలు)

By Srikanya

చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '2.0'(రోబో 2). ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్ర ఓ సైంటిస్టు పాత్ర. ఈ నేపధ్యంలో అక్షయ్ పాత్రను చాలా డిఫరెంట్ గా రూపొందించినట్లు తెలుస్తోంది. తనపై తనే ప్రయోగాలు చేసుకుని కాకిలాగ రూపం మారిపోయిన పాత్ర అని చెప్తున్నారు.

అక్షయ్ పాత్రకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. అతడికి కాకి గెటప్ వేశారు. బ్లాక్ కలర్ డ్రెస్, పెద్ద కనుబొమలు, వెరైటీ కనుగడ్లు, వైట్ హెయిర్ తో చూడగానే భయం కలిగించేలా అక్షయ్ కుమార్ గెటప్ ఉంది. ఈ గెటప్ ని చూసిన వారు ఎమోజింగ్ స్పైడర్ మ్యాన్ లో విలన్ గెటప్ గుర్తుకు వస్తోందంటున్నారు. క్రింద ఫొటోలలో మీరు ఈ విషయాన్ని గమనించవచ్చు.

ఈ చిత్రం షూటింగ్ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. ఇక్కడి జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఫైట్ సీన్స్ షూట్ చేసారు. పడక్బందీగా షూటింగ్ సాగిస్తుండడంతో ఈ సినిమాకు సంబంధించిన సంగతులు బయటకు రావడం లేదు.

స్లైడ్ షోలో ఫొటోలు మరిన్ని విశేషాలతో...

అనుమతి లేదు

అనుమతి లేదు

షూటింగ్ స్పాట్ కు సెల్ ఫోన్లు కూడా అనుమతించడం లేదు. అయినా కొన్ని ఫొటోలు ఇలా బయిటకు వస్తున్నాయి.

మొదట వేరే

మొదట వేరే

విలన్ పాత్రపై కొన్నాళ్లూ సస్పెన్స్ కొనసాగింది. హాలీవుడ్ మెగా హీరో అర్నాల్డ్ స్కాజ్‌నిగర్ అనుకుని కుదరక ఆయన స్థానంలో అక్షయ్ కుమార్‌ను ఫిక్స్ చేసేశారు.

అదిరిపోయే కెమెరా

అదిరిపోయే కెమెరా

కెమెరా బాధ్యతలను నిరవ్ షా తీసుకున్నారు. పైసా వసూల్, ధూమ్ లాంటి చిత్రాలకు నిరవ్ కెమెరామెన్‌గా పనిచేశారు.

త్రీడి ఎఫెక్ట్

త్రీడి ఎఫెక్ట్

రోబో 2.0ను త్రీడీలో షూట్ చేస్తున్నారు. ప్రపంచ స్థాయి సినిమాగా రోబోను రూపొందించేందుకు మేటి టెక్నీషియన్లు అంతా ఒకే వేదికగా పనిచేయనున్నారు.

కాస్టూమ్స్ విషయంలో

కాస్టూమ్స్ విషయంలో

విలన్, హీరో ఇలా అందరికీ ఈ ఫిల్మ్‌లో కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా కనిపించనున్నాయి. హాలీవుడ్ సంస్థ మేరీ ఈ వోగ్ట్ కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయనుంది.

అమీ చేస్తోంది

అమీ చేస్తోంది

ఐ సినిమాలో అందాలతో కిక్కెక్కించిన అమీ జాక్సన్ రోబో-2లోనూ హీరోయిన్ పాత్రను పోషిస్తోంది.

ఫుట్ బాల్ మ్యాచ్

ఫుట్ బాల్ మ్యాచ్

రజనీ, అక్షయ్ పాల్గొనగా ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియమ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ సీన్లు తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్టేడియమ్ చుట్టూ పెద్ద పెద్ద బెలూన్లు, 'ఐఎఫ్‌ఎల్' లోగో, 'చెన్నై వెర్సస్ ముంబయ్' ఇలా రియల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ని తలపించే సందడి నెలకొంది.

రిహార్సల్స్

రిహార్సల్స్

ఇప్పటికే పలువురు జూనియర్ ఆర్టిస్టులతో శంకర్ రిహార్సల్స్ చేయిస్తున్నారు. ఈ వారం నుంచీ రజనీకాంత్, అక్షయ్‌కుమార్ మ్యాచ్ ఆడనున్నారు. సినిమాకి కీలకంగా నిలిచే ఈ సన్నివేశాల చిత్రీకరణకు దాదాపు 40 రోజులు పడుతుందని సమాచారం.

అమితాబ్ ని వద్దని..

అమితాబ్ ని వద్దని..

వాస్తవానికి ఇందులో అక్షయ్ చేస్తున్న విలన్ పాత్రకు ముందుగా అమితాబ్‌ను అడిగారు దర్శకుడు శంకర్. ఆ పాత్ర గురించి రజనీని అమితాబ్ సంప్రతిస్తే, విలన్‌గా మిమ్మల్ని అంగీకరించరని, చేయొద్దనీ అన్నారట.

రెహమాన్ సంగీతం

రెహమాన్ సంగీతం

'రోబో 2.0'కు డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X