మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు.. సాయి పల్లవి గురించి దర్శకుడి స్పందన!

ప్రేమమ్ చిత్రంతో సౌత్ లో గుర్తింపు పొందిన సాయి పల్లవి, ఫిదా చిత్రంతో తెలుగులో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అందాల ఆరబోతకు దూరంగా ఉండే సాయి పల్లవి నటనతోనే ఇంతటి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కుర్రకారు సాయిపల్లవి నటనకు ఫిదా అవుతుంటారు. ఫిదా, ఎంసీఏ, పడిపడి లేచే మనసు లాంటి చిత్రాలు సాయి పల్లవి నటించింది. సాయి పల్లవి, దర్శకుడు ఏఎల్ విజయ్ గురించి వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. తమ మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందనే వార్తలపై దర్శకుడు విజయ్ క్లారిటీ ఇచ్చాడు.

 పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ

పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ

సాయి పల్లవి, విజయ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, త్వరలో వివాహం కూడా చేసుకుంటారని తమిళ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలు హాట్ టాపిక్ గా మారడంతో సాయి పల్లవి పెళ్లి గురించి చర్చ సర్వత్రా జరిగింది. చలాకి నటనతో ఆకట్టుకునే సాయి పల్లవికి యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 కారు చిత్రంలో

కారు చిత్రంలో

విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి కారు చిత్రంలో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలయింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో వీరి మధ్య బంధం బలపడి ప్రేమించుకున్నారని, వివాహానికి కూడా సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. విజయ్ కి గతంలోనే వివాహం జరిగింది. క్రేజీ హీరోయిన్ అమల పాల్, విజయ్ 2014లో పెళ్లి చేసుకున్నారు. కానీ విభేదాల కారణంగా 2017లో విడిపోయారు. కాగా అమలాపాల్ మాజీ భర్తతో సాయి పల్లవి ప్రేమేంటి అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా జరిగింది.

పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు

పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు

ఈ వార్తలపై దర్శకుడు విజయ్ స్పందించారు. తనకు, సాయి పల్లవికి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందనే ప్రచారాన్ని ఖండించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. నాకు సాయి పల్లవితో ప్రేమేంటి.. ఆమె నాకు మంచి స్నేహితురాలు. ఇలాంటి వందతులు రెండు కుటుంబాలపై ప్రభావం చూపుతాయి అని విజయ్ తెలిపాడు. తన జీవితంలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆలోచన నటనకు లేదని విజయ్ తెలిపాడు.

 సాయి పల్లవి ఘాటుగా

సాయి పల్లవి ఘాటుగా

ఈ వార్తలపై సాయి పల్లవి కూడా స్పందించినట్లు తెలుస్తోంది. తన గురించి అసత్యాలు ప్రచారం చేస్తే మీడియా సంస్థలపై దావా వేస్తానని సాయి పల్లవి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు తాను ఎప్పటికి వివాహం చేసుకోననీ, తల్లి దండ్రులతోనే ఒంటరిగా ఉంటానని సాయి పల్లవి గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X