సంతోషం, బాధ అనుభవించా... అమలా పాల్ మాజీ భర్త రెండో పెళ్లి, ఈవిడతోనే!
హీరోయిన్ అమలా పాల్ తమిళ దర్శకడు ఎఎల్ విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2011లో ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం (తెలుగులో విక్రమ్ హీరోగా వచ్చిన 'నాన్న') షూటింగులో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అమలా పాల్‌పై ప్రేమ పెంచుకున్న ఈ డైరెక్టర్... 'తలైవా'(తెలుగులో 'అన్న') చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ క్రమంలో వీరి ప్రేమ బంధం మరింత బలపడింది. అయితే ఈ ఇద్దరి లవ్ మ్యారేజ్ మూన్నాళ్ల ముచ్చటే అయింది. 2014లో పెళ్లాడిన ఈ జంట 2017లో విడిపోయారు. అమలా పాల్ పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి సినిమాల్లో రాణిస్తుండగా... విజయ్ ఇపుడు మరో వివాహం చేసుకోవడానికి సిద్దమయ్యాడు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ స్టేట్మెంట్ విడుదల చేశాడు.

సంతోషం, బాధ అన్నీ అనుభవించాను
జీవిత ప్రయాణం అనేది ప్రతి మనిషికీ ప్రత్యేకంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అందరి లాగా నా జీవితంలో కూడా చాలా రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయాలు, అపజయాల, సంతోషం, బాధ ఇలా అన్నీ చూశాను. ఇవన్నీ నన్ను మరింత స్ట్రాంగ్ చేశాయి.

త్వరలో మరో పెళ్లి చేసుకుంటున్నాను
నాకు మీడియా వారు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటూ వస్తున్నారు. మిమ్మల్ని నేను స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తాను. ఎందుకంటే మీరు నా ఎమోషన్స్ అర్థం చేసుకున్నారు. నా ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చారు. అలాంటి మీతో ఒక ముఖ్యమైన విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. త్వరలో నేను మరో వివాహం చేసుకోబోతున్నాను.

ఆమె ఒక డాక్టర్
నాతో జీవితం పంచుకోవడానికి ఒక వ్యక్తి వస్తున్నారు. ఆమె డాక్టర్.ఆర్. ఐశ్వర్య. మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఈ వేడుకను పూర్తి ప్రైవేట్ సెర్మనీగా జరుపుకోబోతున్నాం. జులైలో మా వివాహం జరుగబోతోంది. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్న నేపథ్యంలో మీ ఆశీర్వాదం కావాలి.... అంటూ విజయ్ ప్రెస్ స్టేట్మెంట్ విడుదల చేశారు.

ఎఎల్ విజయ్ సినిమాల విషయానికొస్తే...
ఎఎల్ విజయ్ సినిమాల విషయానికొస్తే... ఆయన దర్శకత్వం వహించిన ‘దేవి 2' అనే చిత్రం తెలుగులో ‘అభినేత్రి 2' పేరుతో గత నెలలో విడుదలైంది. ప్రస్తుతం జయలలిత బయోపిక్ చేస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











