అల్లరి నరేష్, కలర్స్ స్వాతి కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్
అప్పలరాజు చిత్రంలో సునీల్ సరసన మెరిసిన కలర్స్ స్వాతి త్వరలో అల్లరి నరేష్ సరసన చేయనుంది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందే ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. తమిళ దర్శకుడు మరియు హీరో అయిన శశికుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆమె అల్లరి నరేష్ కు జోడీగా కనిపంచనుంది. ఇక శశికుమార్ కి జోడిగా షాపింగ్ మాల్ అంజలి ని తీసుకున్నారు. ఈ చిత్రానికి తెలుగులో రవితేజతో శంభో శివ శంభో చిత్రం డైరక్ట్ చేసిన సముద్ర ఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని కలర్స్ స్వాతి కన్ఫర్మ్ చేస్తూ...ప్రస్తుతం రామ్ 'కందిరీగ"లో గెస్ట్‌రోల్ చేస్తున్నాను. తమిళంలో సముదిరఖని దర్శకత్వంలో శశికుమార్ అల్లరి నరేష్ హీరోలుగా త్వరలో మొదలుకానున్న సినిమాలో హీరోయిన్‌గా చేయబోతున్నా అంది.


Click it and Unblock the Notifications











