అల్లరి నరేష్, స్వాతి తమిళ చిత్రం షురూ...
'శంభో శివ శంభో" వంటి పలు హిట్ చిత్రాల్ని తమిళంలో రూపొందించిన సముద్రఖని దర్శకత్వంలో అల్లరి నరేష్, శశికుమార్ హీరోలుగా తమిళంలో 'పోరాలి" చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం తెలుగు హక్కుల్ని శ్రీ రంజిత్ మూవీస్, టింబు ప్రొడక్షన్స్ సంస్థలు పొంది, తెలుగులో విడుదల చేయనున్నాయి. తమిళనాడులో ఈ చిత్రాన్ని పంపిణీ చేయడానికి పలు కార్పొరేట్ సంస్థలు పోటీపడుతున్నాయని, అటువంటి క్రేజ్ ఉన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు హక్కులు పొందడంలో సహకరించిన అల్లరి నరేష్ అమ్మిరాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలయజేశారట.
ఇటీవలే ఈ సంస్థనుంచి అలా మొదలైంది వంటి హిట్ చిత్రం వచ్చింది. నరేష్ పాత్ర వినోదంగా నిలిస్తే, శశికుమార్ క్యారెక్టర్ ఎమోషనల్ గా సాగుతుందని నిర్మాతలంటున్నారు. స్వశక్తి మీద నిలవాలనుకునే ఇద్దరు కుర్రాళ్ళ కథ ఇది. ప్రేమ అంతర్లీనంగా ఉంటుంది. కేరళ, తమిళనాడులోని తేనె లొకేషన్లలో చిత్రీకరించిన యాక్షన్ దృశ్యాలు ఈ చిత్రంలో హైలైట్ గా నిలుస్తాయట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. కలర్స్ స్వాతి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











