Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్.. టెంపర్ రీమేక్‌లో వాడేస్తున్నారుగా!
హీరో విశాల్ కు తమిళంతో పాటు, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఒకరకంగా విశాల్ కు తెలుగు రాష్ట్రాలు సొంత గడ్డ లాంటివే. విశాల్ నటించే ప్రతి చిత్రం తెలుగులో కూడా విడులవుతుంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ఎన్టీఆర్ టెంపర్ చిత్రాన్ని విశాల్ తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో ఈ చిత్రాన్ని అయోగ్య పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అయోగ్య ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా అయోగ్య గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
మాస్ మసాలా ఎలిమెంట్స్
టెంపర్ చిత్రంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ క్రేజ్ కు తగ్గట్లుగా అన్ని మాస్ ఎలిమెంట్స్ ని రూపొందించాడు. ఎన్టీఆర్ డాన్సులు, ఫైట్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ఐటెం సాంగ్ కూడా అలరించింది. మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి సందేశాన్ని కూడా పూరి ఈ చిత్రంలో చూపించాడు. ఫలితంగా టెంపర్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్ర విజయంతో తమిళ, హిందీ భాషల్లో రీమేక్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది.
'బ్లాక్ బస్టర్' సాంగ్
టెంపర్ తమిళ రీమేక్ చిత్రం అయోగ్యలో కూడా దర్శకుడు వెంకట్ మోహన్ అదిరిపోయే ఐటెం సాంగ్ కు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలోని బ్లాక్ బస్టర్ సాంగ్ వెంకట్ మోహన్ తో పాటు విశాల్ ని కూడా విపరీతంగా ఆకర్షించిందట. దీనితో ఈ పాటనే అయోగ్యలో రీమిక్స్ చేయాలని దర్శకుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సరైనోడు బ్లాక్ బస్టర్ సాంగ్ తెలుగు ఆడియన్స్ ని బాగా కట్టుకుంది. ఈ సాంగ్ లో అంజలి గ్లామర్, అల్లు అర్జున్ స్టెప్పులు, తమన్ అందించిన ట్యూన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
శ్రద్దా దాస్
బ్లాక్ బస్టర్ సాంగ్ రీమిక్స్ లో హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ టెంపర్ కథలో ఎలాంటి మార్పులు చేసినట్లు కనిపించలేదు. టెంపర్ చిత్రాన్ని అలాగే కాపీ పేస్ట్ చేసేస్తున్నారనే కామెంట్స్ కూడా అయోగ్యపై వినిపించాయి. అయోగ్య చిత్రం టెంపర్ చిత్ర స్థాయిని నిలబెట్టేలా ఉంటుందో లేదో విడుదలయ్యాకే తేలనుంది.
అదరగొట్టిన సింబా
ఇక టెంపర్ హిందీ రీమేక్ సింబా చిత్రం గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్, సారా అలీఖాన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. హిందీ ఆడియన్స్ ని అలరించిన ఈ చిత్రం రణవీర్ సింగ్ ఖాతాలో ఘనవిజయంగా నిలిచింది. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని చూసి పెదవి విరిచారు. టెంపర్ కథని కిచిడి చేశారంటూ కామెంట్స్ వినిపించాయి.