అల్లు అర్జున్, శింబు జడ్జిలుగా...
అల్లు అర్జున్,శింబు న్యాయ నిర్ణేతలుగా పాల్గొనే పోటీ ఒకటి జరగనుంది. ప్రముఖ శీతలపానియాల సంస్ద 7 అప్ తాజాగా '7 అప్ పటాలం' పేరిట ఈ పోటీలను నిర్వహించనుంది. దీని నిమిత్తం వీరిద్దరూ జడ్జిలుగా ఉంటారు. ఇందు నిమిత్తం కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో తనతో కలసి డాన్స్ చేసే అవకాశం కొరకు హైదరాబాద్, బెంగుళూరు, తమిళనాడులో పోటీలు నిర్వహిస్తున్న నటుడు శింబు కోరారు. ఇందుకోసం 7 సభ్యులు వుండే టీమ్ ఎంపిక కోసం ఆయా రాష్ట్రాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలలో ఫైనల్స్ చేరిన జట్లకు నిర్వహించే పోటీలలో 7 అప్ బ్రాండ్ అంబాసిడర్‌లు శింబు, అల్లు అర్జున్‌లు న్యాయనిర్ణేతలుగా పాల్గొంటారు.
విజేతకు శింబుతో కలసి డాన్స్ చేసే అవకాశంతో పాటు 51 లక్షల బహుమతులను అందుకోనున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. జులాయి టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక గతంలో అల్లు అర్జున్ చేసిన వేదంలో పాత్రను తమిళంలో శింబు చేసారు. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఈ రకంగా జడ్జిలుగా పాల్గొనటం ఇద్దరు అభిమానలుకు ఆనందాన్ని కలగచేస్తోంది.


Click it and Unblock the Notifications











