మేకప్ లేని, డీ గ్లామరస్ రోల్ ఓకే చేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ త్వరలో మేకప్ లేకుండా డీ గ్లామర్ గా ఉండే ఓ పాత్రను చేయటానికి రెడీ అవుతున్నాడని సమాచారం. తమిళంలో మంచి విజయం సాధించిన కళావని చిత్రం రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుంది. లో బడ్జెట్ లో నిర్మితమైన ఈ చిత్రం రీమేక్ రైట్స్ ప్రముఖ దర్శకుడు గౌతం మీనన్ పొందారు. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రూపొందించాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం అల్లు అర్జున్ ని సంప్రదిస్తే వెంటనే కాదనకుండా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే అల్లు అరవింద్ మాత్రం తన కుమారుడు ఇలాంటి డీ గ్లామర్ పాత్రలు చేయటానికి ఇష్ట పడటం లేదని చెప్తున్నారు.కాబట్టి ఆయన రిజెక్టు చేసి అడ్డు పడితే తప్ప ఈ ప్రాజెక్టు ఆగే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా ఓవైవా అనే కొత్త హీరోయిన్ ని పరిచయం చేయాలని గౌతమ్ మీనన్ తలపోస్తున్నారు. ఆయన నాగచైతన్యతో రూపొందించిన ఏమి మాయ చేసావే హిట్ తో తెలుగులో స్టార్ డైరక్టర్ గా మారారు. అందరు పెద్ద హీరోలు ఆయనతో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











