తమిళ అసెంబ్లీలో పుష్ప 2.. దళపతి విజయ్‌పై ఉదయనిధి వివాదాస్పద కామెంట్స్!
తమిళనాడు అసెంబ్లీలో తొలి సమావేశం రచ్చగా ముగిసింది. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ సర్కార్ బల పరీక్ష గందరగోళం మధ్య ముగిసింది. మైనారిటీ సర్కారుగా బాధ్యతలు చేపట్టిన విజయ్ బుధవారం రోజున తనకు ఉన్న మద్దతును స్పీకర్ ముందు చూపించుకొన్నారు. అయితే 108 సీట్లు గెలిచిన టీవీకే పార్టీకి మొత్తం 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో పూర్తి మెజారిటీ లభించింది. ఈ బలపరీక్ష సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆయన చేసిన సంచలన ఆరోపణలు ఆసక్తికరంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకొన్న విషయాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో ఇటీవల అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు రెండో రోజున కొలువ దీరారు. స్పీకర్ సమక్షంలో విజయ్ సర్కార్ బలపరీక్షకు సిద్దమైంది. ఏఐడీఎంకే నుంచి చీలిపోయిన 30 మందికిపైగా ఎమ్మెల్యేలు బేషరుతుగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అప్పటికే 120 మంది ఎమ్యెల్యేల మద్దతు ఉన్న విజయ్ సర్కార్ మరింత బలాన్ని పెంచుకొని మెజారీ ప్రభుత్వంగా మారింది. ఈ బల పరీక్ష సమయంలో ఉదయనిధి స్టాలిన్ ఘాటైన ప్రసంగాన్ని చేశారు.

టీవీకే ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకొనేందుకు అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. పుష్ప సినిమాలో మాదిరిగా సోఫా సెట్లు పంపింది. ఆ సోఫా సెట్లలో డబ్బుల కట్టలు పంపించి ప్రజా ప్రతినిధులను కొన్నారు. మార్పు కోసం ప్రభుత్వం అంటూ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మార్పిడి చేసుకొని బలాన్ని నిరూపించుకొన్నారు. ఇంతకంటే దారుణమైన విషయం మరోటి ఉంటుందా? అని ఉదయనిధి ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల ఇంటికి ముందుగా సోఫాలు పంపించారు. ఆ తర్వాత సీఎం వెళ్లారు. సోఫా సెట్‌తో రాజకీయం చేయడమే కాకుండా ఎమ్మెల్యేలను కొన్నారు. ఎన్నికలకు ముందు ఏఐడీఎంకే పార్టీ అవినీతి పార్టీ అన్నారు. కానీ ఎన్నికల తర్వాత ఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్నారు. వచ్చే నెల నుంచి టీవీకే పార్టీ చేసిన హామీలను అమలు చేయాలని ఉదయనిధి డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో క్లీన్ ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పారు. కానీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలను సొంతలో కొనుగోలు చేసినట్టు కొన్నారు. భారీగా డబ్బు చెల్లించి ఎమ్మెల్యేల మద్దతు సంపాదించారు. మన్నారు గుడి కామరాజ్ ఎమ్మెల్యే కూడా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇది చాలా నిరాశను కలిగించింది అని డీఎంకే ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications