అల్లు శిరీష్ వివాహ వార్తల ఖండన
అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ వివాహం పరిశ్రమకు చెందిన ఓ పెద్ద కుటుంబానికి చెందిన ఓ అమ్మాయితో నిశ్చియమైందని వార్తలు వచ్చాయి. అయితే అల్లు శిరీష్ కి చెందిన శ్రేయాభిలాషులు, అతని స్నేహితులు దానిని ఖండిస్తున్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ... అల్లు శిరీష్ వయస్సు కేవలం 24 సంవత్సరాలు. అతను త్వరలో తమిళంలో లాంచ్ అవుతున్నాడు. ప్రస్తుతం అతని దృష్టి అంతా కెరీర్ పైన ఉంది. ఈ వయస్సులో అతను పెళ్లి ఎట్లా చేసుకుంటాడు అన్నారు.
అలాగే...శిరీష్,ఆమె చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆమె ఓ పెద్ద కుటుంబానికి చెందినది. తెలుగు పరిశ్రమలో ఇద్దరూ చాలా గౌరవనీయమైన కుటుంబాలకి చెందివారు. ఇటువంటి కథలు వారి మీద అల్లటం పద్దతి కాదు. వారి స్నేహాన్ని ఇలా అర్దం చేసుకోవటం సరికాదు. మరో నాలుగైదు ఏళ్లు అయ్యాక,కెరిర్ లో సెటిల్ అయ్యాక శిరీష్ పెళ్లి చేసుకుంటాడు. ప్రస్తుతం శిరీష్ ..గౌరవం అనే చిత్రంలో చేస్తున్నాడు. రాధామోహన్ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. బాలీవుడ్ కి చెందిన ఒకమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేసాం అన్నారు.
అల్లు శిరీష్ ప్రస్తుతం ఏక్టింగ్ ట్రైనింగ్ లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే తమిళంలో లాంచ్ అవ్వబోతున్నట్లు చెప్తున్నారు. అందుకోసమే డైలాగు డిక్షన్,యాక్టింగ్ ఎబిలిటీస్ కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. గౌరవం చిత్రాన్ని మొదట నాగచైతన్యతో అనకున్నారు. కానీ బడ్జెట్ పెరిగిపోవటంతో దాన్ని అల్లు శిరీష్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ దాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీగా ఆ చిత్రాన్ని తెలుగులో సైతం రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











