twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు శిరిష్ హీరోగా ఆ రీమేక్ ఖరారు

    By Srikanya
    |

    అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కి ఎప్పటినుంచో హీరో కావాలనే కోరిక ఉంది.అయితే మంచి కథ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ తన ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.తెలుగులో సూపర్ హిట్టైన 100% లవ్ చిత్రాన్ని తమిళంలో తననే హీరోగా పెట్టుకుని రీమేక్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.నాగచైతన్య చేసిన పాత్రలో అల్లు శిరీష్ కనిపిస్తారు.ఇక తమన్నానే హీరోయిన్ గా అడగాలని ప్లాన్ చేస్తున్నారు.తమిళ దర్శకుడు కన్నన్ ఈ చిత్రం డైరక్ట్ చేయటానికి అంగీకరించారని చెప్తున్నారు.గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితం కానుంది.అందుకోసమే మొదట డబ్బింగ్ చేసి తమిళంలో రిలీజ్ చేద్దామనుకున్న ఈ చిత్రాన్ని ఆపుచేసారు.ఇక ప్రస్తుతం తమిళంకు సరపడ మార్పులు చేసే పనిలో దర్శకుడు ఉన్నాడని,అల్లు అరవింద్ స్క్రిప్టు ఫైనలైజ్ చేస్తే సెట్స్ కి వెళ్ళి సంక్రాంతికి విడుదల పెట్టుకుందామనే స్పీడులో ఉన్నారు.ఇక 100% లవ్ రీమేక్ చేయటం ద్వారా విజయాన్ని కొనసాగించినట్లు అవుతుందని,మంచి మార్కటింగ్ స్ట్రాటజీగా చెప్తున్నారు.

    English summary
    Allu Sirish, choosing Tamil film industry to screen debut as hero.The debut film of sirish is a remake of Telugu super hit movie 100% love with Naga Chaitanya and Tamanna In Lead Roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X