అల్లు శిరీష్ 'గౌరవం' పోస్టర్ ఇదే...
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే. నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. గౌరవం చిత్రాన్ని మొదట నాగచైతన్యతో అనకున్నారు. కథ ఓకే చేసి ఫోటో షూట్ లు సైతం జరిగాయి. కానీ చివరి నిముషంలో ప్రాజెక్టు ఇలా అల్లు శిరీష్ కి చేరింది. బడ్జెట్ బాగా ఎక్కువ అవుతూండటంతో వర్కవుట్ కాదని దాన్ని నాగార్జున రిజెక్టు చేసినట్లు సమాచారం.
ఈ చిత్రం విశేషాలను ప్రకాశ్ రాజ్ తెలియజేస్తూ -''డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.


Click it and Unblock the Notifications












